Kumari Aunty: తెలుగు రాష్ట్రాల్లో కుమారి ఆంటీ తెలియని వారుండరు. ఈ స్ట్రీట్ ఫుడ్ వెండార్… రాజకీయ చర్చకు కూడా దారి తీసింది. కుమారి ఆంటీ 13 ఏళ్లుగా హైదరాబాద్ లో స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ చేస్తుంది. పలు రకాల వెజ్, నాన్ వెజ్ వంటకాలతో ఆమె భోజనం అందిస్తున్నారు. కొందరు ఫుడ్ వ్లాగర్స్, యూట్యూబర్స్ కుమారి ఆంటీని ఇంటర్వ్యూ చేశారు. ఆమె రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ కి కస్టమర్స్ మరింతగా పెరిగారు.
కస్టమర్స్ కి తోడు యూట్యూబర్స్ అక్కడకు భారీగా చేరుకోవడంతో గందరగోళం నెలకొంది. కుమారి ఆంటీ బిజినెస్ ఉన్న ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాంతో పోలీసులు ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది. వారు అనూహ్యంగా కుమారి ఆంటీ బిజినెస్ క్లోజ్ చేయించారు. దీనిపై సాధారణ జనాలు మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా తమ నిరసన వ్యక్తం చేశారు. దెబ్బకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కల్పించుకున్నారు. కుమారి ఆంటీ మరలా తన వ్యాపారం కొనసాగించేలా ఆదేశాలు జారీ చేశారు.
కుమారి ఆంటీ షాపు తొలగింపు రాజకీయ రంగు పులుముకుంది. వైసీపీ వర్సెస్ కాంగ్రెస్-టీడీపీ అన్నట్లు సాగింది. ఇదిలా ఉంటే కుమారి ఆంటీ గతంలో ఒక సింగర్ వద్ద పని చేసేదట. కొన్నేళ్ల క్రితం సొంతగా బిజినెస్ స్టార్ట్ చేసింది. కాగా కుమారి ఆంటీ వంటలకు ఓ స్టార్ హీరో కూడా ఫిదా అయ్యాడని సమాచారం. ఆయన ఎవరో కాదు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆయన కుమారి ఆంటీ వద్ద కూరలు తెప్పించుకుని తినేవాడట. ఎన్టీఆర్ కి కుమారి ఆంటీ వంటకాలు అమిత ఇష్టం అట.
ఎన్టీఆర్ తో పాటు నటుడు ఆలీ కూడా కుమారి ఆంటీ కస్టమర్ అట. ఆమె ఫేమస్ అయ్యాక ఈ విషయాలు మెల్లగా వెలుగులోకి వస్తున్నాయి. కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వద్దకు హీరో సందీప్ కిషన్ వచ్చాడు. భోజనం చేసి ఆమెతో ముచ్చటించాడు. ఆ రోజు కుమారి ఆంటీకి సందీప్ కిషన్ రూ. 10 వేలు ఇచ్చాడని సమాచారం. ఒక స్ట్రీట్ ఫుడ్ వెండార్ ఇలా సంచనాలు చేయడం ఊహించని పరిణామం.
Web Title: That star hero is kumari aunty customer
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com