Hero Gopichand: మన టాలీవుడ్ లో మంచి మాస్స్ ఇమేజి ఉన్న హీరోలలో ఒక్కరు గోపీచంద్..తొలివాలుపు అనే సినిమా ద్వారా హీరో గా పరిచయం అయినా ఈయన నటన పరంగా తోలి సిఎంమాతోనే పర్వాలేదు అని అనిపించుకున్నాడు..కానీ ఎందుకో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయింది..ఇక తర్వాత ప్రముఖ దర్శకుడు తేజ తెరకెక్కించిన జయం సినిమా లో విలన్ గా నటించి ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ సినిమాలో హీరోగా నటించిన నితిన్ కంటే గోపీచంద్ కి ఎక్కువ పేరు వచ్చింది..ఇక ఆ తర్వాత మహేష్ బాబు నిజం , మరియు ప్రభాస్ వర్షం సినిమాలలో వరుసగా విలన్ రోల్స్ చేసి తనకంటూ ఒక్క ప్రత్యేకమైన క్రేజ్ ని ఏర్పరచుకున్నాడు గోపీచంద్..ఇక తమిళ్ లో జయం సినిమాని రీమేక్ చెయ్యగా అందులోనూ గోపీచంద్ విలన్ గా నటించి మంచి మార్కులు కొట్టేసాడు..ఇలా విలన్ గా సౌత్ ఇండియా లో క్రేజీ మూవీస్ తో దూసుకుపోతున్న గోపీచంద్ కి ఇతర బాషలలో కూడా విలన్ గా నటించేందుకు అవకాశాలు వెల్లువలాగా కురిసాయి.
కానీ గోపీచంద్ మనసు మార్చుకొని హీరో రోల్స్ వైపు మొగ్గు చూపదు..వాస్తవానికి గోపీచంద్ అన్ని విధాలుగా హీరో రోల్స్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే కటౌట్ అని చెప్పొచ్చు..కానీ తొలుత వచ్చిన అవకాశాలను ఉపయోగించుకొని విలన్ గా మంచి పేరు సంపాదించి ఆ తర్వాత హీరో రోల్స్ చేసాడు..హీరో గా కూడా ఆయన రణం , యజ్ఞం , లక్ష్యం , శౌర్యం, లౌక్యం,సాహసం, గౌతమ్ నంద మరియు సీటిమార్ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోగా నటించి మంచి మాస్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్నాడు..కానీ కొత్త హీరోల తాకిడికి హీరో గా గోపీచంద్ క్రేజ్ బాగా తగ్గిపోయింది అనే చెప్పాలి..ఈయనతో సినిమాలు చెయ్యడానికి డైరెక్టర్స్ మరియు నిర్మాతలు ముందుకు వస్తున్నా కూడా కెరీర్ కి మంచి బూస్ట్ ని ఇచ్చే హిట్ మాత్రం పడట్లేదు..కొంతమంది డైరెక్టర్స్ గోపీచంద్ తో మళ్ళీ విలన్ రోల్స్ వేయించడానికి ముందుకు రాగా గోపీచంద్ అందుకు అంగీకరించలేదు..లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ఏమిటి అంటే త్వరలో రాజమౌళి మహేష్ బాబు తో చెయ్యబొయ్యే సినిమాలో గోపీచంద్ ని విలన్ రోల్ కోసం అడిగారట..అందుకు గోపీచంద్ చాలా సున్నితంగా రిజెక్ట్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read: The economic situation of Telangana : కేసీఆర్ కు ఈనెల గడిస్తే అదే చాలబ్బా!
రాజమౌళి సినిమాలో విలన్ అంటే మాములు విషయం కాదు..హీరో కి సరిసమానంగా విలన్ ని చూపించడం లో రాజమౌళి దిట్ట..బాహుబలి సినిమాలో కూడా రానా ని విలన్ గా చూపించి నేషనల్ వైడ్ క్రేజ్ ని రప్పించుకున్నాడు..గోపీచంద్ కూడా అలాంటి అవకాశం ని చేతులారా వదులుకొని చాలా పెద్ద పొరపాటు చేసాడు అని ఇండస్ట్రీ లో వినిపిస్తున్న గుసగుసలు..గోపీచంద్ ఆ సినిమాని ఒప్పుకొని చేసి ఉంటె ఆయనకి నేషనల్ వైడ్ క్రేజ్ వచ్చేది అని..ఆ తర్వాత గోపీచంద్ హీరో గా కూడా పాన్ ఇండియా రేంజ్ సినిమాలు చేసుకునే మార్కెట్ లభించి ఉండేది అని, అలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు అని సినీ విశ్లేషకులు అంటున్నారు..ప్రస్తుతం గోపీచంద్ చేతిలో పక్క కమర్షియల్ అనే సినిమా ఒక్కటే ఉన్నది..డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న ఈ సినిమా మీదనే గోపీచంద్ పూర్తిగా ఆశలు పెట్టుకున్నాడు..ఈ సినిమా తర్వాత ఆయన చేతిలో ఎలాంటి క్రేజీ ప్రాజెక్ట్ లేదు..ఇంతకు ముందు నాని మరియు సాయి ధరమ్ తేజ్ వంటి వారికి కెరీర్ పూర్తిగా డౌన్ లో ఉన్నప్పుడు భలే భలే మొగాడివోయ్ మరియు ప్రతి రోజు పండగే వంటి సెన్సషనల్ హిట్స్ ఇచ్చి వారి కెరీర్ కి సరికొత్త ఊపు ని ఇచ్చాడు..అలా గోపీచంద్ కి కూడా జరుగుతుందో లేదో చూడాలి.
Also Read: Congress Nava Sankalp Shibir: రేవంత్ రెడ్డి లేనిది చూసి ‘భట్టి’ పట్టిస్తున్నారు!
Recommended Videos