Mahesh Babu Dual Role: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస విజయాలతో మంచి జోష్ మీద ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే..ఇటీవలే ఆయన హీరో గా నటించిన సర్కారు వారి పాట సినిమా విడుదల అయ్యి యావరేజి టాక్ తో కూడా సూపర్ హిట్ స్టేటస్ ని అందుకుంది అంటే మహేష్ బాబు కి ఫామిలీ ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉందొ అర్థం చేసుకోవచ్చు..ఈ సినిమా తర్వాత ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక్క సినిమా చెయ్యబోతున్నాడు..అతడు మరియు ఖలేజా వంటి క్లాసిక్స్ ఇచ్చిన ఈ కాంబినేషన్ అంటే కేవలం మహేష్ బాబు అభిమానులకే కాదు, ఇతర హీరోల అభిమానులకు కూడా ఇష్టమే..అందుకే ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పటి నుండి భారీ స్థాయి అంచనాలు ఏర్పడ్డాయి..ట్రేడ్ లో కూడా ఈ సినిమాకి ఉన్న క్రేజ్ వేరు..అందులోనూ త్రివిక్రమ్ శ్రీనివాస్ అరవింద సామెత,అలా వైకుంఠపురం లో మరియు భీమ్లా నాయక్ వంటి సూపర్ హిట్ సినిమాలతో మంచి ఊపు మీద ఉండడం తో మా హీరో కి కూడా అదిరిపొయ్యే బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తాడు అనే నమ్మకం తో ఉన్నారు మహేష్ అభిమానులు.

ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించి రోజుకో వార్త సోషల్ మీడియా లో ప్రచారం అవుతూనే ఉంది..నిన్న మొన్నటి వరుకు ఈ సినిమాలో నందమూరి హీరో తారక రత్న విలన్ గా నటించబోతున్నట్టు వార్తలు వినిపించాయి..అయితే ఇందులో ఎలాంటి నిజం లేదు అని తారక రత్న టీం అధికారిక ప్రకటన చెయ్యడం తో ఆ రూమర్స్ కి చెక్ పడింది..ఇప్పుడు ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం తమిళ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి..ఇది పక్కన పెడితే ఈ సినిమా గురించి నిన్నటి నుండి సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఒక్క వార్త అభిమానులను థ్రిల్ కి గురి చేస్తోంది..అదేమిటి అంటే ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నాడట..చిన్నతనం లో కొడుకు దిద్దిన కాపురం సినిమా ద్విపాత్రాభినయం చేసిన మహేష్ బాబు, హీరో గా మారిన తర్వాత మాత్రం ఒక్క సినిమాలో కూడా డ్యూయల్ రోల్ చెయ్యలేదు.

Also Read: AP Tenders: ఏపీ టెండర్లలో కొత్త రూల్.. పనులు చేయాలి కానీ డబ్బులడగొద్దు
తమ అభిమాన హీరో ని డ్యూయల్ రోల్ లో చూడాలని అభిమానులు ఎప్పటి నుండో ఎదురు చూస్తూ ఉన్నారు..కానీ ఎందుకో మహేష్ ఇప్పటి వరుకు డ్యూయల్ రోల్ చెయ్యలేదు..అయితే త్రివిక్రమ్ సినిమాలో మహేష్ డ్యూయల్ రోల్ చేసేంత స్కోప్ ఉంది అని లేటెస్ట్ గా ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్..అంతే కాకుండా ఈ సినిమాలో మహేష్ తో పాటుగా ఒక్క యువ హీరో కూడా నటించబోతున్నట్టు తెలుస్తుంది..ఇప్పటికే హీరో నాని కోసం ఈ చిత్ర బృందం ప్రయత్నం చేసింది..కానీ ఆయన డేట్స్ ఖాళి లేకపోవడం తో ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేకపోయాడు..ఇప్పుడు శర్వానంద్ కోసం సంప్రదింపులు చేస్తున్నారు..పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని భీమ్లా నాయక్ నిర్మాత సూర్య దేవర నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు..ఈ సినిమాకి అర్జునుడు అనే టైటిల్ ని పెట్టడానికి చూస్తున్నారు దర్శక నిర్మాతలు..దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా తెలియనున్నాయి.

Also Read: Poorna Engagement: హీరోయిన్ పూర్ణ సీక్రెట్ నిశ్చితార్థం..వరుడు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Recommended Videos


