Pawan Kalyan: చిరంజీవి తమ్ముడు గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఆయన పేరు చెప్తే చాలు అభిమానులు ఆయన కోసం ఏదైనా చేస్తారు అలాంటి పిచ్చి ప్రేమను పవన్ కళ్యాణ్ తన అభిమానుల నుంచి సంపాదించుకున్నాడు అంటే నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఇక ఈయన చేసిన చాలా సినిమాల్లో కొన్ని హిట్లు ఉన్నాయి, మరికొన్ని ప్లాప్ లు కూడా ఉన్నాయి.
అయినప్పటికీ ఈయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఎప్పుడు తగ్గలేదు. అయితే పవన్ కళ్యాణ్ కి మిగతా హీరోలకి ఉన్న తేడా ఏంటి అంటే పవన్ కళ్యాణ్ మిగతా హీరోలా లాగా అమ్మాయిల వెంట పడి సీన్లు గానీ, చిల్లర చిల్లర చేష్టలు చేయడం లాంటి సీన్లు గాని తన సినిమాల్లో చేయడానికి యాక్సెప్ట్ చేయడు. ఇక మిగతా హీరోలైతే స్టోరీ డిమాండ్ చేస్తే ఏదైనా చేయడానికి రెడీగా ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ అసభ్యకరమైన సీన్లు ఉంటే మాత్రం నేను చేయనని చెప్తాడు.
అందుకే ఆయన ఎక్కువగా ఫ్యామిలీ సబ్జెక్ట్ లను ఎంచుకొని ఫ్యామిలీ సినిమాలు చేస్తూ సక్సెస్ లను కొడుతూ ఉంటాడు…ఇక దీనికి పూరి జగన్నాథ్ తీసిన ఇడియట్ సినిమాని ఒక ఉదాహరణ గా చెప్పవచ్చు. ముందుగా ఈ స్టోరీ ని పూరి పవన్ కళ్యాణ్ కి చెప్పాడు అయితే అందులో హీరో క్యారెక్టర్ తన సిగ్గు విడిచి నటించాల్సి ఉంటుంది. కాబట్టి చాలా సిగ్గుపడే తత్వం ఉన్న పవన్ కళ్యాణ్ అలాంటి క్యారెక్టర్ లో తనని తాను చూసుకోలేడని అందుకే ఆ స్టోరీని రిజెక్ట్ చేశాడు. ఇక దాంతో ఈ స్టోరీ ని పూరి జగన్నాథ్ రవితేజ కి చెప్పి ఆయనతో తీసి సూపర్ డూపర్ హిట్ కొట్టాడు.
అలా పవన్ కళ్యాణ్ కి మిగతా హీరోలకి మధ్య ఉన్న ఈ తేడాల వల్లనే ఆయన చాలా హిట్ సినిమాలను కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఇక కేవలం హిట్ల కోసం ఇష్టం లేకపోయిన ఆ సినిమాల్లో నటించే తత్వం తనకు మొదటి నుంచి లేదు అందువల్లే తను సపరేట్ గా ఫ్యామిలీ సబ్జెక్టులను గాని, సెంటిమెంటల్ సబ్జెక్టులను గాని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.అంతే తప్ప ఏ స్టోరీ పడితే ఆ స్టోరీ పవన్ కళ్యాణ్ చేయడు అనేది మాత్రం వాస్తవం…