https://oktelugu.com/

Pushpa 2: పుష్ప 2 లో ఆ డైలాగ్ ఒక సాహసం! స్టార్ రైటర్ కీలక కామెంట్స్

పుష్ప 2 విడుదలకు సమయం దగ్గరపడుతుండగా టీమ్ నిరవధికంగా ప్రమోషన్స్ చేస్తున్నారు. దానిలో భాగంగా నేడు మూవీలోని ఐటెం నెంబర్ విడుదల చేస్తున్నారు. సాయంత్రం 7 గంటలకు కిస్సిక్.. అనే సాంగ్ విడుదల కానుంది. యంగ్ బ్యూటీ శ్రీలీల కెరీర్లో ఫస్ట్ టైం ఐటెం సాంగ్ చేస్తుంది. మొదట్లో శ్రీలీల చేయను అన్నారట. భారీగా రెమ్యూనరేషన్ ఇవ్వడంతో పాటు పట్టుబట్టి దర్శకుడు సుకుమార్ ఒప్పించాడని సమాచారం. ఇక పుష్ప 2 ట్రైలర్ ఏ రేంజ్ లో ఆదరణ సొంతం చేసుకుందో తెలిసిందే.

Written By:
  • S Reddy
  • , Updated On : November 24, 2024 / 10:57 AM IST

    Pushpa 2 The Rule

    Follow us on

    Pushpa 2: బీహార్ రాజధాని పాట్నాలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. లక్షల మంది ఈ వేడుకలో పాల్గొన్నారు. అల్లు అర్జున్ ఒక కొత్త ట్రెండ్ కి నార్త్ లో శ్రీకారం చుట్టాడు. చెన్నైలో మరో ప్రమోషనల్ ఈవెంట్ జరుగుతుంది. దీనికి ఓ భారీ ఆడిటోరియం వేదిక కానుంది. ఇదిలా ఉంటే సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ పుష్ప 2 ట్రైలర్ పై తన రివ్యూ వెల్లడించారు. తన యూట్యూబ్ ఛానల్ వేదికగా పుష్ప 2 ట్రైలర్ పై ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు.

    ‘పుష్ప టైటిల్ చిన్నదే కానీ భారీ విజయం అందుకుంది. పుష్ప 2 కి ది రూల్ అనే ట్యాగ్ లైన్ పెట్టి… హీరో రెండో పార్ట్ లో మాఫియా సామ్రాజ్యాన్ని రూల్ చేస్తాడని చెప్పకనే చెప్పారు. కాగా పుష్ప అంటే పేరు కాదు బ్రాండ్ అనే డైలాగ్ చెప్పడం నిజంగా ఒక సాహసం. అల్లు అర్జున్ హెలికాఫ్టర్ నుండి దిగే షాట్ ద్వారా.. ఎర్ర చందనం స్మగ్లర్స్ ఏ స్థాయికి వెళుతున్నారో చెప్పారు. శ్రీవల్లి నా పెళ్ళాం.. పెళ్ళాం మాట మొగుడు వింటే ఎట్టా ఉంటాదో ఈ ప్రపంచానికి చూపిస్తా.. అనే డైలాగ్ గొప్పగా ఉంది.

    నాకు రావలసిన పైసా.. అణా అయినా అర్థ అణా అయినా.. అది ఏడు కొండల మీదున్న.. ఏడు సముద్రాల దాటున్నా.. పోయి తెచ్చుకోవడం పుష్ప గాడికి అలవాటు, అని చెప్పడం ద్వారా పుష్ప తనది పైసా అయినా కూడా వదలడు అని తెలియజేశారు. పుష్ప నేషనల్ అనుకుంటివా.. ఇంటర్నేషనల్ అని చెప్పడం ద్వారా హీరో స్థాయి తెలియజేశారు. పుష్ప మూవీ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా..” అని పరుచూరి గోపాల కృష్ణ అన్నారు.

    పుష్ప 2 డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో విడుదల కానుంది. అల్లు అర్జున్ కి జంటగా రష్మిక మందాన నటిస్తుంది. జగపతిబాబు, రావు రమేష్, ఫహద్ ఫాజిల్, అనసూయ, సునీల్ ఇతర కీలక రోల్స్ చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పుష్ప 2 చిత్రానికి దేవిశ్రీ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే..