Tandel : తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చాలు ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉంటాయి. ఇక వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగా సినిమా ఉన్నట్టయితే సినిమాను బ్లాక్ బస్టర్ సక్సెస్ ని చేసి చూపిస్తారు. ఇలాంటి సందర్భంలోనే భారీ అంచనాల మధ్య ఈనెల 7 వ తేదీన ‘తండేల్ ‘ (Thandel) సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. నాగచైతన్య(Naga Chaithanya) నటించిన ఈ సినిమా యావత్ ఇండియన్ ప్రేక్షకులందరిని ఆకట్టుకుంటుందనే ఉద్దేశ్యంతో సినిమా మేకర్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించడమే కాకుండా పాన్ ఇండియా సినిమాగా రూపొందించారు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాలో లవ్ స్టోరీ తో పాటు దేశభక్తి కూడా చాలా మెండుగా ఉందని మేకర్స్ తెలియజేస్తున్నారు. మరి ఈ సినిమా లో ఇవి రెండు చాలా హైలెట్ గా నిలవబోతున్నాయట. ప్రేక్షకులందరూ వాళ్ళ అభిరుచి మేరకు ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా వాళ్లకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించడానికి ఈ సినిమా చాలావరకు హెల్ప్ చేస్తుంది అంటూ సినిమా యూనిట్ తెలియజేస్తుంది. ఇక ఏది ఏమైనా రీసెంట్ గా జరిగిన ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా నిర్వహించడమే కాకుండా సినిమా మీద బజ్ ను మరింత పెంచే ప్రయత్నం చేశారు. ఆయన కెరియర్ లోనే ఈ సినిమా ది బెస్ట్ సినిమాగా నిలుస్తుంది అంటూ నిర్మాత అల్లు అరవింద్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు.
ఇక ఇప్పటికే అల్లు అరవింద్ బ్యానర్ లో నాగచైతన్య ‘100% లవ్’ అనే సినిమా చేశాడు. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇక ఆ సినిమాను మించి ఈ సినిమా ఉండబోతుందట. అలాగే ఈ సినిమాలో ఒక సోషల్ మెసేజ్ ని కూడా ఇవ్వబోతున్నాం అంటూ సినిమా మేకర్స్ నుంచి వార్తలైతే వినిపిస్తున్నాయి…
ఇక సాయి పల్లవి కెరియర్ లో కూడా ఆమె చేసిన పాత్ర ఒక మైల్ స్టోన్ గా నడిచిపోతుందనే వార్తలు కూడా వెలువడుతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా సక్సెస్ అయితే నాగచైతన్య స్టార్ హీరోగా వెలుగొందుతాడు.
లేకపోతే మాత్రం ఆయన మార్కెట్ మరింత డౌన్ అయిపోయే అవకాశాలైతే ఉన్నాయి. ఇప్పుడున్న యంగ్ హీరోలందరితో పోల్చుకుంటే నాగచైతన్య కొంతవరకు వెనుకబడి పోతున్నడనే చెప్పాలి. మరి ఈ సినిమా సక్సెస్ అయితే మాత్రం ఆయన నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…