https://oktelugu.com/

Thandel Collections : తండేల్ మూవీకి మొదటి రోజు కలెక్షన్స్ ఏంటి ఇంత తక్కువగా వచ్చాయి…ఇంతకీ ఈ సినిమా పరిస్థితి ఏంటి..?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు వచ్చి ప్రేక్షకులను మెప్పిస్తూ ముందుకు సాగుతున్నాయి. ఇక ఈ సంవత్సరం ఇప్పటికే సంక్రాంతి కానుకగా వచ్చిన సినిమాలు మంచి విజయాల బాట పట్టడమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఈ ఇయర్ మంచి ఓపెనింగ్స్ ను కూడా అందించాయి. ఇప్పుడు నాగచైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా వచ్చిన తండేల్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది... అయితే ఈ సినిమాతో మంచి వసూళ్లను రాబడతాడు అంటూ మొదటి నుంచే ఈ సినిమా పట్ల మంచి బజ్ అయితే ఉంది.

Written By:
  • Gopi
  • , Updated On : February 8, 2025 / 10:46 AM IST
    Thandel Collections

    Thandel Collections

    Follow us on

    Thandel Collections :  తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడునాగ చైతన్య(Naga Chaithanya) అక్కినేని ఫ్యామిలీ నుంచి మూడోతరం హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే కాకుండా మంచి సినిమాలు చేయడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నాడు. ఇక రీసెంట్ గా ఆయన తండేల్ (Thandel) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక మొదటి షో తోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్న ఈ సినిమాకి మొదటి రోజు భారీ కలెక్షన్స్ వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమాకి ఫస్ట్ డే 9 కోట్ల గ్రాస్ మాత్రమే రావడం అనేది ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నిజానికి ఈ సినిమా మీద మంచి హైప్ అయితే ఉంది. మరి ఇలాంటి సందర్భంలో ఈ సినిమాకి ఇంత తక్కువ కలెక్షన్స్ ఎందుకు వచ్చాయి అంటూ మేకర్స్ కూడా ఆలోచనలో పడ్డట్టుగా తెలుస్తోంది.

    మరి ఏది ఏమైనా కూడా అక్కినేని ఫ్యామిలీ అభిమానులు సైతం ఈ సినిమాని చూడడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం… మరి మొదటి రోజు ఈ సినిమా కలెక్షన్స్ తగ్గినప్పటికి ఆ తర్వాత రాబోయే రోజుల్లో ఈ సినిమా మంచి హైప్ ను మెయింటైన్ చేస్తూ భారీ కలెక్షన్స్ ని రాబడుతుంది అంటూ మేకర్స్ అయితే దృఢ సంకల్పంతో ఉన్నారు.

    ఇక ఇదిలా ఉంటే ఈ వీకెండ్ లో చాలా మంచి వసూళ్లను కూడా రాబడుతుందనే ఒక కాన్సెప్ట్ తో అయితే వాళ్ళు ఉండడం విశేషం…మరి ఏది ఏమైనా కూడా ఇలాంటి తండేల్ లాంటి సినిమాను ప్రేక్షకులందరు అమితంగా ఇష్టపడుతున్నారు. కానీ వసూళ్లు మాత్రం చాలా తక్కువగా వస్తున్నాయి. కారణం ఏదైనా కూడా ఈ వీకెండ్ లోనే ఈ సినిమా భారీగా వసూళ్లను రాబట్టాల్సిన అవసరమైతే ఉంది.

    లేకపోతే మాత్రం లాంగ్ రాన్ లో ఈ సినిమాకి కలెక్షన్స్ కొంతవరకు తగ్గే ప్రమాదం కూడా ఉంది. ఇక ఇప్పటికే ఈ సినిమా మీద 75 కోట్ల బడ్జెట్ నైతే పెట్టారు. మరి ఆ బడ్జెట్ ను రికవరీ చేస్తూ భారీ లాభాలను తెచ్చి పెడుతుందా? లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది… ఇక ఏది ఏమైనా కూడా నాగచైతన్య చేసిన ఈ సినిమాకి విశేషమైన స్పందన రావడం అనేది ఒక వంతుకు మంచి విషయమనే చెప్పాలి…