Thaman: డిమాండ్ ఉన్నపుడు నిర్మాతలు వెనుకబడతారు. అడిగింది కాదనకుండా ఇచ్చేస్తారు. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని కొందరు ఆర్టిస్ట్స్, టెక్నీషియన్స్ విపరీతంగా దోచేస్తారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అదే చేస్తున్నాడని లేటెస్ట్ టాక్. ఈ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నాడట. తాజాగా ఓ నిర్మాతకు రూ. 40 లక్షలు హోటల్ బిల్లు పంపాడట. కేవలం హోటల్ లో ఉన్నందనుకు ఇన్ని లక్షల బిల్లా అని సదరు నిర్మాత నోరెళ్లబెట్టాడట. చెన్నైలో ఉండే థమన్ హైదరాబాద్ వస్తే కేవలం పార్క్ హయత్ లోనే దిగుతాడట.
ఈ క్రమంలో ఒక సూట్ రూమ్ సహా, కొన్ని రూమ్స్ థమన్ పేరున బుక్ చేయాల్సి ఉంటుందట. ఈ రూమ్స్ ఎప్పుడూ థమన్ పేరునే బుక్ చేసి ఉంటాయట. ఆయన పని చేసే సినిమాలకు సంబంధించిన వర్క్ ఇక్కడే చేసుకుంటాడట. అలా తను మ్యూజిక్ అందిస్తున్న నిర్మాతలలో ఒకరు హోటల్ బిల్ చెల్లించాల్సి ఉందట. థమన్ వ్యవహారం పరిశ్రమలో హాట్ టాపిక్ అవుతుంది. ఈ మధ్య బిజీగా ఉండి అనుకున్న సమయానికి మ్యూజిక్ కూడా ఇవ్వడం లేదట.
ఆ మధ్య మహేష్ బాబు థమన్ మీద అసహనం ప్రదర్శించాడనే పుకారు వినిపించింది. గుంటూరు కారం మూవీ సాంగ్స్ విషయంలో థమన్ బాగా లేజీగా ఉంటున్నాడట. త్రివిక్రమ్ కి థమన్ ని తీసేద్దామని కూడా సలహా ఇచ్చాడట. థమన్ తో ఆయన కాంబినేషన్ వర్క్ అవుట్ అవుతున్న క్రమంలో త్రివిక్రమ్ మహేష్ కి నచ్చజెప్పాడట. లేకుంటే గుంటూరు కారం నుండి థమన్ తప్పుకోవాల్సి వచ్చేదట.
ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే థమనే. అతడు దేవిశ్రీని కూడా వెనక్కి నెట్టాడు. మొన్నటి వరకు దేవిశ్రీ ఏకఛత్రాధిపత్యం చేశాడు. మణిశర్మ డల్ అయ్యాక హవా థమన్-దేవిశ్రీలదే. ఒక దశలో థమన్ ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. అరవింద సమేత వీర రాఘవ నుండి ఫార్మ్ లోకి వచ్చాడు. అల వైకుంఠపురంలో ఆల్బమ్ థమన్ కి ఎక్కడలేని ఫేమ్ తెచ్చిపెట్టింది. అక్కడి నుండి స్టార్ హీరోల మొదటి ఛాయిస్ అయ్యాడు.