Thaman Geetha Madhuri: ప్రస్తుతం ప్రేక్షకులందరు సినిమాల ద్వారానే కాకుండా షోల ద్వారా కూడా ఎంటర్ టైన్ అవుతున్నారు. రీసెంట్ గా ఆహా లో ‘తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4’ అయితే స్టార్ట్ అయింది. గతం లో వచ్చిన 3 సీజన్స్ కి మంచి రెస్పాన్స్ రావడంతో మరింత అప్డేటెడ్ వెర్షన్ గా ‘ తెలుగు ఇండియన్ ఐడియల్ 4’ అయితే స్టార్ట్ చేశారు. మరి ఈ షోలో కంటెస్టెంట్స్ గాని, జడ్జీలు గాని వింత వింత గా ప్రవర్తిస్తున్నారు. నిజానికి ఒకామె అమెరికాలోని డల్లాస్ నుంచి వచ్చింది ఆమె పేరు శ్రీజ..ఆమె తమన్ కి వీరాభిమాని అని చెబుతూనే తన చెంపలు గిల్లాలని ఉందని ఆయన దగ్గరికి వెళ్లి తమన్ చెంపను గిల్లింది… ఇక దాంతో తమన్ అయన పక్కనే ఉన్న గీతామాధురి చెంపను గిల్లాడు. ఇక గీతామాధురి ఒక్క ఆమె చెంపను గిల్లితే బాగుండదనే ఉద్దేశంతో ఆ పక్కనే ఉన్న కార్తీక్ చెప్పను కూడా తమన్ గిల్లాడు. సింగింగ్ షో లో ఈ గిల్లడం ప్రోగ్రామ్ ఏంటి? అనే దానిమీద ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది.
Also Read: ప్రభాస్ పెళ్లి చెడగొట్టింది ఎవరు..? అందుకే ఆయన ఇక మ్యారేజ్ చేసుకొనని డిసైడ్ అయ్యాడా..?
సింగింగ్ షో అంటే సింగర్స్ ఎలా పడుతున్నారు. వాళ్లు ఎలాంటి మెలుకువలు నేర్చుకోవాలి. ఫ్యూచర్లో మంచి ప్లేబాక్స్ సింగర్ గా మారాలంటే వాళ్ళు ఎలా కష్టపడాలి అనే విషయం మీద జడ్జెస్ చెప్తే బాగుంటుంది. దాన్ని పక్కన పెట్టి పక్కన ఉన్న జడ్జెస్ ను గిల్లడం ఇలాంటివి చేయడం ఎందుకు అని చాలామంది ఈ షో యాజమాన్యాన్ని విమర్శిస్తున్నారు.
డైరెక్టర్ రాసుకున్న స్క్రిప్ట్ లో భాగంగానే వాళ్లతో ఇదంతా చేయిస్తూ ఉంటారు. కానీ సింగింగ్ షోని చూసే వాళ్లకు మాత్రం ఇదంతా కొంచెం ఎబ్బెట్టుగా అనిపించవచ్చు…ఇక ప్రస్తుతం ఇదంతా చూసిన ప్రేక్షకులు సైతం సోషల్ మీడియాలో ఈ షో మీద చాలా నెగెటివ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. సింగింగ్ షో అంటే సింగింగ్ షో లానే ఉండాలి గాని, వాళ్ళకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తే వాళ్ల వాల్యూ పోవడమే కాకుండా షో యొక్క పరువు కూడా పోయే ప్రమాదం ఉంది.
ఇంత చిన్న లాజిక్ ని ఎలా మర్చిపోయారు అంటూ చాలామంది కామెంట్స్ చేస్తుండటం విశేషం…మరి ఏది ఏమైనా కూడా ఇలాంటి ఎక్స్ట్రాలు తగ్గించుకొని సింగింగ్ షోని ముందుకు తీసుకెళ్తే ఆ షో చూసే వాళ్లకు సైతం దాని మీద రెస్పెక్ట్ అయితే ఉంటుంది. లేకపోతే మాత్రం ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయడం వల్ల షో యొక్క పరువు పోతుంది. అలాగే ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయడం వల్ల జడ్జెస్ మూడ కూడా నెగెటివ్ ఇంప్రెషన్ వచ్చే అవకాశం అయితే ఉంది…