Homeఎంటర్టైన్మెంట్Thaman Keeps His Word: మహేష్ అభిమాని మరణం.. గొప్ప మనసు చాటుకున్న తమన్

Thaman Keeps His Word: మహేష్ అభిమాని మరణం.. గొప్ప మనసు చాటుకున్న తమన్

Thaman Keeps His Word: ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో తన మ్యూజిక్ తో మంచి గుర్తింపును సంపాదించుకున్న సంగీత దర్శకుడు తమన్… తన మ్యూజిక్ తో సినిమాలకి ప్రాణం పోయడమే కాకుండా సమాజ సేవ చేసి చాలా మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు… గత సంవత్సరం మహేష్ బాబు వీరాభిమాని అయిన రాజేష్ మరణించడంతో తన కుటుంబం రోడ్డున పడింది. తనకి శివరామ్, సారిక శ్రీ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక ఆ సమయంలో అతని ధీన పరిస్థితిని తెలుసుకున్న ప్రొడ్యూసర్ ఎస్ కే ఎన్ అతనికి రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాడు. ఇక అదే సమయంలో తమన్ సైతం రాజేష్ గురించి తెలుసుకొని అతని జీవిత గాధని విని చెల్లించిపోయి తన పిల్లల చదువులకు అయ్యే పూర్తి బాధ్యత నాదే అంటూ ఎక్స్ లో ఒక ట్వీట్ అయితే పెట్టాడు. దాన్ని చూసిన ప్రతి ఒక్కరు తమన్ ను మెచ్చుకున్నారు. అయితే అది ఎంతవరకు పాజిబిలిటీ అవుతుంది అనే ఒక చిన్న డౌట్ అయితే ప్రతి ఒక్కరి మదిలో మెదిలింది.

మొత్తానికైతే ఇప్పుడు స్కూల్స్ రీ ఓపెన్ అవుతున్న నేపథ్యంలో తమన్ ఆ ఇద్దరు పిల్లల స్కూల్ ఫీజు కట్టి వాటి రసీదులను ఎక్స్ లో పోస్ట్ చేశాడు. ఇది చూసిన ప్రతి ఒక్కరు తమన్ ను విపరీతంగా మెచ్చుకుంటున్నారు. నిజానికి తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా చాలా బిజీగా ఉంటూనే సమాజం గురించి కూడా ఆలోచిస్తున్నాడు అంటే నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. మన స్టార్ హీరోలు చాలామందికి ఆర్థిక సహాయాన్ని అందిస్తుంటారు.

పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం పేదలకు కావాల్సిన ప్రతీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వాళ్లకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండే విధంగా చూసుకుంటూ ఉంటారు. ఇక అల్లు అర్జున్ సైతం ఇదే బాటలో నడుస్తున్నాడు. ప్రస్తుతం తమన్ సైతం తనకు తోచిన సహాయాన్ని చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం… రీసెంట్ గా పవన్ కళ్యాణ్ సైతం వరంగల్ కి చెందిన నిరంజన్ అనే ఒక కుర్రాడు అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడనే విషయాన్ని తెలుసుకొని అతనికి ఇష్టమైన కుక్క పిల్లను గిఫ్ట్ గా ఇచ్చాడు…

అల్లు అర్జున్ సైతం శ్రద్ధా అనే అమ్మాయి క్యాన్సర్ తో బాధపడుతుందని తెలుసుకొని తనని కలిసి ఆమెను ఆనందపడేలా చేశాడు. ఇక ఏది ఏమైనా కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు టెక్నీషియన్లు ఇలా సమాజం పట్ల కూడా ఆలోచిస్తే చాలా బాగుంటుందని చాలామంది పిల్లలు చదువుకుంటారని, ఇంకొంతమంది వృద్ధిలోకి వచ్చే అవకాశం కూడా ఉంటుందని భావిస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular