Thaman On Guntur Kaaram: సంగీత దర్శకుడు థమన్ పై ఎప్పుడూ ఏదో ఒక వివాదం నడుస్తుంది. ముఖ్యంగా కాపీ ఆరోపణలు వినిపిస్తుంటాయి. పడుతూ లేస్తూ సాగిన థమన్ కెరీర్లో గత నాలుగేళ్లుగా నిలదొక్కుకున్నాడు. అల వైకుంఠపురంలో మూవీకి థమన్ ఇచ్చిన మ్యూజిక్ బ్లాస్ట్ అయ్యింది. ఆ దెబ్బతో స్టార్ హీరోలందరూ దేవిశ్రీని పక్కన పెట్టి థమన్ వెంటపడుతున్నారు. దీంతో థమన్ క్వాలిటీ మ్యూజిక్ ఇవ్వడం లేదు. వర్క్ డిలే అవుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా గుంటూరు కారం మూవీ విషయంలో థమన్ మీద అనేక పుకార్లు వినిపించాయి. థమన్ సినిమా మీద ఫోకస్ పెట్టడం లేదని మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశాడని ఒక పుకారు వినిపించింది. అలాగే త్రివిక్రమ్ తో థమన్ కి విబేధాలు అంటూ మరో వార్త తెరపైకి వచ్చింది. ఒక దశలో థమన్ ని ప్రాజెక్ట్ నుండి తప్పించారంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ పుకార్ల మీద థమన్ నేరుగా స్పందించారు.
గుంటూరు కారం విషయంలో బయట జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. ఏదైనా సమస్య ఉంటే నిర్మాతలు చెబుతారు కదా. ఎవరూ కావాలని ప్లాప్ సినిమాలు తీయరు. కొన్ని సార్లు సినిమాలు ఆలస్యం కావడం సహజం. ఆ విషయాన్ని పదే పదే రాసి రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదని అన్నారు. మ్యూజిక్ వదిలేసి క్రికెట్ ఆడుకుంటున్నాడంటూ మీపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. దీనిపై మీ స్పందన ఏంటని అడగ్గా…
నాకు మందు అలవాటు లేదు. గర్ల్స్ ఫ్రెండ్స్ వంటి వ్యసనాలు కూడా లేవు. క్రికెట్ అంటే ఇష్టం. ప్రతిరోజూ రాత్రి 9 గంటలకు వెళ్లి క్రికెట్ ఆడతా. పని మానేసి క్రికెట్ ఆడను. అలా అని నా మీద ఏ నిర్మాతైనా కంప్లైంట్ చేశాడా? లేదు కదా. ఏ గొట్టం నా కొడుక్కి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, అని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. థమన్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.