Homeఎంటర్టైన్మెంట్Vijay TVK Party Controversy: ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. తమిళ హీరో విజయ్ పై కఠిన...

Vijay TVK Party Controversy: ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. తమిళ హీరో విజయ్ పై కఠిన చర్యలకు సిద్దమైన ఎన్నికల సంఘం..

Vijay TVK Party Controversy: తమిళ హీరో విజయ్(Thalapathy Vijay) ఇప్పుడు మరో వివాదం లో చిక్కుకున్నాడు. వచ్చే నెలలో తమిళనాడు లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆయన స్థాపించి TVK పార్టీ మొట్టమొదటి ఎన్నికలను ఎదురుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రీసెంట్ గానే మొదటి విడత ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాని ప్రకటించిన విజయ్, తానూ పెరంబుర్ , త్రిచి ఈస్ట్ నుండి పోటీ చేయబోతున్నట్టు చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా నిన్న పెరంబూర్ లో విజయ్ నామినేషన్ దాఖలు చేసాడు. విజయ్ ని వీక్షించేందుకు వేల సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. అయితే అక్కడ ఆయన ఎన్నికల కోడ్ ని ఉల్లగించినట్టు పోలీస్ కేసు నమోదు అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే విజయ్ ఉన్న ప్రాంతం లో ఒక అంబులెన్స్ ఉండగా, దాని మార్గాన్ని బ్లాక్ చేసారని, అంతే కాకుండా 5000 మంది కంటే ఎక్కువగా ఈ సభలో అభిమానులు పాల్గొన్నారని ఎన్నికల కోడ్ ప్రకారం ఇది రూల్స్ కి విరుద్ధమని పేరువళ్లూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది.

ఎలక్షన్ కమీషన్ కూడా ఈ అంశం పై చాలా గట్టిగానే విజయ్ పార్టీ ప్రతినిధులను మందలించిందని అంటున్నారు. ఇప్పటికే కరూర్ ఘటన లో 41 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, అంతటి దారుణం జరిగిన తర్వాత కూడా నిబంధనలు ఎలా ఉల్లంగిస్తారు?, దీనికి కఠిన చర్యలు తప్పవు అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారట. అంటే విజయ్ పై ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ?, ఒకవేళ ఇప్పుడు ఆయన పై చర్యలు తీసుకుంటే సెంట్రల్ లో ఉన్న బీజేపీ పార్టీ కావాలనే ఇవన్నీ చేయిస్తుంది అనే ప్రచారం జనాల్లోకి వెళ్తుంది. అలా వెళ్తే విజయ్ కి భారీ బలాన్ని చేకూర్చిన వాళ్ళు అవుతారు. ఈ సమయం లో విజయ్ ని ముట్టుకోవడం మంచిది కాదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

బీజేపీ పార్టీ విజయ్ ని NDA లోకి తీసుకొని రావాలని చాలా గట్టి ప్రయత్నాలే చేశారు, చర్చలు కూడా జరిగాయి, కానీ చివరికి విజయ్ ఒంటరిగానే వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాడు. తమ ప్రతిపాదనకు విజయ్ లొంగలేదు కాబట్టే, ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘జన నాయగన్’ కి సెంట్రల్ లో ఉన్నటువంటి సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించిందని, ఇది చాలా అన్యాయం అంటూ తమిళనాడు లో ఇప్పటికే ఒక న్యారేటివ్ జనాల్లోకి బలంగా వెళ్ళింది. ఇది విజయ్ పొలిటికల్ మైలేజ్ కి సహాయపడ్డాయి. ఇలాంటి సమయం లో ఎన్నికల సంఘం ఆయనపై ఏ చిన్న చర్య తీసుకున్నా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version