Homeఎంటర్టైన్మెంట్Tollywood: యాంక‌ర్ల నుంచి హీరోయిన్లుగా మారిన ముద్దుగుమ్మ‌లు వీరే..!

Tollywood: యాంక‌ర్ల నుంచి హీరోయిన్లుగా మారిన ముద్దుగుమ్మ‌లు వీరే..!

Tollywood: సినిమా రంగం అంటేనే ఒక స్థాయిలో ఉన్న వారు ఏ స్థాయికి అయినా ఎదిగే అవ‌కాశాలు ఉంటాయి. ఇలాగే బుల్లితెర‌పై యాంక‌ర్లుగా రాణించిన వారు కూడా హీరోయిన్లుగా రాణించారు. మ‌రి యాంక‌ర్ టు హీరోయిన్‌గా ఎదిగిన ముద్దుగుమ్మలు ఎవ‌రో ఇప్పుడు తెలుసుకుందాం. ఇలా చెప్పుకోవాల్సి వ‌స్తే తెలుగులో చాలా పెద్ద లిస్టే ఉందండోయ్‌. ముందుగా మెగా డాట‌ర్ నిహారిక గురించి చెప్పుకోవాలి.

Tollywood
Niharika

ఈమె ఓ ప్రముఖ చానెల్ లో డ్యాన్స్ షోకు యాంక‌ర్‌గా చేసింది. ఆ త‌ర్వాత ఒక మ‌న‌సు సినిమాతో హీరోయిన్ గా మారిపోయింది. ఇక పెండ్లి త‌ర్వాత సినిమాలు మానేసిన నిహారిక‌.. వెబ్ సిరీస్ లు నిర్మిస్తోంది. హీరోయిన్ రెజీనా క‌సాండ్రా కూడా ఇదే కోవ‌లోకి వ‌స్తుంది. ఈమె త‌మిళంలో మొద‌ట ఓ క్విజ్ ప్రోగ్రామ్‌కు యాంక‌ర్ గా చేసింది. ఆ త‌ర్వాత 2005లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు హీరోయిన్ గా మంచి సినిమాలే చేస్తుంది అమ్మ‌డు.

Tollywood
Regina Cassandra

క‌ల‌ర్స్ స్వాతి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈమె తెలుగులో చేసిన క‌ల‌ర్స్ అనే ప్రోగ్రామ్ ఎంత‌లా ఫేమ‌స్ అయిందో తెలిసిందే. ఆమె పేరు క‌ల‌ర్స్ స్వాతి అని అప్ప‌టి నుంచే పాపుల‌ర్ అయింది. దీని త‌ర్వాత ఆమె అష్టాచెమ్మ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. స్టార్ హీరోయిన్ కాలేక‌పోయింది కానీ.. ఎన్నో గుర్తుండిపోయే పాత్ర‌లు చేసింది ఈ ముద్దుగుమ్మ‌. ఇప్ప‌టికీ సినిమాల్లో మంచి క్యారెక్ట‌ర్లు వ‌స్తే చేయ‌డానికి రెడీగానే ఉంది.

Tollywood
Colors Swathi

అన‌సూయ బుల్లి తెర‌పై ఓ ఫేమ‌స్ కామెడీ షో ద్వారా యాంక‌ర్‌గా ఎంట్రీ ఇచ్చింది. అయితే దీంతో ఆమెకు ఎక్క‌డ‌లేని క్రేజ్ వ‌చ్చేసింది. ఇక సినిమాల్లో కూడా న‌టిస్తోంది. క్ష‌ణం, రంగ‌స్థ‌లం మూవీల్లో ఈమె చేసిన క్యారెక్ట‌ర్లు బాగా పేరు తీసుకు వ‌చ్చాయి. ర‌ష్మీ కూడా 2005 నుంచే యాంక‌ర్‌గా కొన‌సాగుతోంది. అయితే గుంటూరు టాకీస్ మూవీతో హీరోయిన్ గా మారింది. ఇప్ప‌టికీ అటు సినిమాల్లో ఇటు యాంక‌రింగ్ ఫీల్డ్ లో రాణిస్తూనే ఉంది.

Tollywood
Anasuya

Also Read: పవన్ కళ్యాణ్, చిరంజీవి: కత్తి దూసేది ఒకరు… కాంప్రమైజ్ చేసేది మరొకరు

హీరోయిన్లు అయిన యాంకర్లు || Telugu Anchors Turns As Heroines || Oktelugu Entertainment

బిగ్ బాస్ ర‌న్న‌ర‌ప్ శ్రీముఖి కూడా ప‌టాస్ షో ద్వారా యాంక‌ర్ అయింది. అక్క‌డి నుంచి చంద్రిక సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు సినిమాల్లో న‌టిస్తూనే యాంక‌ర్ గా కొనసాగుతోంది. ఇప్పుడు సుమ కూడా జ‌యమ్మ పంచాయ‌తీ మూవీతో లీడ్ రోల్ చేస్తోంది. ఇలా వీరంతా యాంక‌ర్ టు హీరోయ‌న్లుగా మారి మంచి గుర్తింపు తెచ్చుకున్నార‌న్న మాట‌.

Tollywood
Sreemukhi

Also Read: ష‌ణ్ముఖ్ తో దీప్తి విడిపోవడానికి వాళ్లే కారణమట.. షాకింగ్ నిజాలు?

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Exit mobile version