https://oktelugu.com/

Eesha Rebba : షార్ట్ ఫ్రాక్ లో కిరాక్ ఫోజులు… బీచ్ లో రెచ్చిపోయిన తెలుగు పిల్ల ఈషా రెబ్బా..  ఫొటోలు వైరల్

దర్శకుడు త్రివిక్రమ్ అరవింద సమేత వీరరాఘవ చిత్రంలో ఈషా రెబ్బా పాత్రకు కనీస ప్రాధాన్యత లేకుండా చేశాడు. స్టార్ హీరో మూవీలో నటించినా ఆమెకు గుర్తింపు రాలేదు అఖిల్ అక్కినేని హీరోగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్రంలో చిన్న గెస్ట్ రోల్ చేసింది.

Written By:
  • NARESH
  • , Updated On : January 4, 2024 / 09:08 PM IST
    Follow us on

    Eesha Rebba : అందం అభినయం ఉండి కూడా ఈషా రెబ్బాకు కాలం కలిసి రాలేదు. ఆమె రేసులో వెనుకబడిపోయారు. వరంగల్ కి చెందిన ఈషా రెబ్బా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యింది. హ్యాపీ డేస్ హిట్ తో జోరు మీదున్న దర్శకుడు శేఖర్ కమ్ముల నుండి వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే హ్యాపీ డేస్ రేంజ్ హిట్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కొట్టలేకపోయింది.

    కెరీర్ బిగినింగ్ లో ఈషా రెబ్బాకు అడపాదడపా హిట్ పడ్డాయి. అంతకు ముందు ఆ తర్వాత, అమీ తుమీ, అ చిత్రాలు హిట్ స్టేటస్ అందుకున్నాయి. అయితే కెరీర్ కి బ్రేక్ ఇచ్చే ఒక్క చిత్రం కూడా ఆమెకు పడలేదు. ఈషా రెబ్బా కేరీర్ గ్రాఫ్ పడుతూ వచ్చింది. ఆమె రేంజ్ సెకండ్ హీరోయిన్ స్థాయికి పడిపోయింది. ఎన్టీఆర్-పూజా హెగ్డే జంటగా నటించిన అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో ఈషా రెబ్బా నటించడం విశేషం.

    దర్శకుడు త్రివిక్రమ్ అరవింద సమేత వీరరాఘవ చిత్రంలో ఈషా రెబ్బా పాత్రకు కనీస ప్రాధాన్యత లేకుండా చేశాడు. స్టార్ హీరో మూవీలో నటించినా ఆమెకు గుర్తింపు రాలేదు అఖిల్ అక్కినేని హీరోగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్రంలో చిన్న గెస్ట్ రోల్ చేసింది. ఇటీవల దయ టైటిల్ తో ఒక వెబ్ సిరీస్ చేసింది. జేడీ చక్రవర్తి నటించిన ఈ సిరీస్ హిట్ టాక్ తెచ్చుకుంది.

    అడపదడపా ఆఫర్స్ తో నెట్టుకొస్తున్న ఈషా రెబ్బా తెలుగు పరిశ్రమ మీద అసహనం వ్యక్తం చేస్తుంది. బయట పరిశ్రమల వాళ్ళు టాలీవుడ్ గురించి గొప్పగా చెబుతూ ఉంటారు. కానీ తెలుగు అమ్మాయిలకు మాకు మాత్రం ఇక్కడ ఆఫర్స్ ఇవ్వడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కెరీర్ సంగతి ఎలా ఉన్నా లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. ప్రస్తుతం బీచ్ వెకేషన్ లో ఉన్న ఈషా రెబ్బా షార్ట్ ఫ్రాక్ లో సందడి చేసింది. ఆమె గ్లామరస్ లుక్ వైరల్ అవుతుంది.