Telugu film industry: ఓటీటీ సంస్థలు ఫామ్ లోకి వచ్చాక, థియేటర్ల వ్యవస్థ అయోమయ స్థితిలోకి వెళ్ళిపోయింది, ఈ విషయంలోనే బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్స్ ఆందోళన చెందుతున్నారు. నిజానికి కరోనా క్లిష్ట సమయంలో ప్రేక్షకులను అలరించింది, నిర్మాతలకు లాభలను తెచ్చి పెట్టింది ఒక్క ఓటీటీ సంస్థలే. అలాంటి ఓటీటీలను వ్యతిరేఖించడం భావ్యం కాదు. అలా అని థియేటర్లను బయ్యర్లను నిర్లక్ష్యం చేయడం కూడా భావ్యం కాదు.

కానీ, సినిమా అనేది వ్యాపారం.. బిజినెస్ లో లాభం ఎక్కడ ఉంటే.. అందరూ అక్కడికే వెళ్తారు. ప్రస్తుతం కరోనా మూడో వేవ్ కూడా వస్తోంది అని వార్తలు వస్తున్నాయి. ఇక మూడో వేవ్ వస్తే.. థియేటర్ల మొహం కూడా జనం చూడటానికి ఆసక్తి చూపించరు. పైగా ప్రతి వారం ప్రతి ఓటీటీ ప్లాట్ ఫామ్ కొత్త కంటెంట్ తో వస్తోంది. విభిన్న చిత్రాలు, వినూత్న వెబ్ సిరీస్ ల ముందు రెగ్యులర్ థియేటర్ల సినిమాలు ఎంతవరకు నిలబడతాయి ?
అందుకే, థియేటర్ల భవిష్యత్తు పై సినిమా వాళ్లకు భయం పట్టుకుంది. ఇప్పటికే కరోనా కష్ట కాలంలో థియేటర్ల పరిస్థితి దారుణంగా ఉంది. సినిమా బతకడానికి ఓటీటీ ప్రపంచాన్ని తెరలేపారు. దాంతో తెర మీద పడాల్సిన సినిమాలు కాస్త, చేతిలోని మొబైల్ లోకి వచ్చేశాయి. దాంతో ఓటీటీ వలన థియేటర్లకు చాలా నష్టం కలుగుతుంది. కొన్ని రోజులకి థియేటర్ లు కనుమరుగు అవుతాయేమో అనే భయం కూడా ఉంది.
ఓటీటీ అనేది ఒకింతకు మంచి అయినప్పటికీ.. ముందు ముందు సినిమా రంగానికి మాత్రం భారీ నష్టమే. ముఖ్యంగా సినిమా టెక్నీషియన్లకు బాగా ఇబ్బందే. ఇప్పటికే చిన్న కంటెంట్ తో తక్కువ టెక్నీషియన్ లతో సినిమాలను పూర్తి చేస్తున్నారు. అదే థియేటర్ కోసం తీసే సినిమా అయితే, కచ్చితంగా 24 శాఖల వారిని పెట్టుకోవాలి.
ఓటీటీ సినిమాలకు అలాంటి కండిషన్స్ ఏమి లేవు. కాబట్టి.. అందరు టెక్నీషియన్లను పెట్టుకోవాల్సిన పని లేదు. అప్పుడు 24 శాఖల వారికీ పని దొరకదు. పైగా ఓటీటీ వాళ్ళు ఈ మధ్య సినిమా టెక్నీషియన్స్ ను దూరం పెడుతున్నారు. దాంతో సినిమాలనే నమ్ముకున్న చిన్న చిన్న సినిమా టెక్నీషియన్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
దయచేసి చిన్న సినిమా టెక్నీషియన్లను కూడా బతకనిద్దాం.. వాళ్లకు కూడా బతుకునిద్దాం అని బడా చిత్రాల మేకర్స్ ఓ నినాదం అందుకోవాల్సిన అవసరం ఉంది.
Also Read: Acharya Songs: Neelambari song lyrics Telugu and English, నీలాంబరి సాంగ్ లిరిక్స్