Tollywood Trends : టాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. సినీ ఇండస్ట్రీలో ఉన్న ట్యాలెంటెడ్ నటీనటులు, డైరెక్టర్స్ ఇతర భాషల ఇండస్ట్రీలలో కూడా తమ సత్తా చాటుకోవాలని ఉత్సాహపడుతుంటారు. అయితే, తాజాగా టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ తేజ కూడా బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమయ్యారు. తెలుగు చిత్రసీమలో మంచి పాపులర్ అయిన తేజ ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. అయితే, తేజ ఇప్పటికే రెండు బాలీవుడ్ ప్రాజెక్టులను కూడా లైన్‌లో పెట్టినట్టు సమాచారం.

ఇక మరో అప్ డేట్ ఏమిటంటే.. గతేడాది కరోనాతో సతమతమైన టాలీవుడ్‌కి, సరికొత్త ఊపునిచ్చాడు వకీల్ సాబ్. అసలే హీరోయిజం లేని పింక్ రీమేక్ కావడం, పైగా పవన్ కళ్యాణ్ చేస్తుండడంతో సినీ అభిమానుల్లో చాలా అనుమానాలు, ఆసక్తి నెలకొంది. అన్ని అడ్డంకుల్ని అధిగమించి తొలి ఆటతోనే బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకుంది వకీల్‌సాబ్. పవన్ సూపర్ పర్ఫామెన్స్‌తో అభిమానులను ఖుషీ చేసిన ఈ చిత్రం నేడు ఏడాది పూర్తి చేసుకుంది.

ఇక ఇంకో అప్ డేట్ ఏమిటంటే.. యంగ్ హీరో నాగశౌర్య ప్రస్తుతం ”కృష్ణ వ్రింద విహారి” అనే రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఐరా క్రియేషన్స్ నిర్మిస్తుండగా, ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అయితే, తాజాగా ఈ చిత్రం నుంచి “వెన్నెల్లో వర్షంలా…” అనే ఫస్ట్ సాంగ్‌ను స్టార్ హీరోయిన్ సమంత రిలీజ్ చేసింది.

అలాగే మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ విషయానికి వస్తే.. బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ నివాసంలో భారీ చోరీ జరిగింది. గర్భవతిగా ఉన్న సోనమ్ కపూర్ ప్రస్తుతం తన తల్లి వద్ద ఉంటున్నారు. అయితే ఢిల్లీలోని నివాసానికి వెళ్లిన ఆమె దొంగతనం జరిగినట్టు గుర్తించారు. ఇంట్లో ఉండాల్సిన రూ.1.41 కోట్ల విలువైన ఆభరణాలు, నగదు చోరీ జరిగినట్లు పోలీసులుకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సోనమ్ కపూర్ నివాసంలోని పనివాళ్లను అదుపులోకి తీసుకొన్ని విచారిస్తున్నారు.
చివరి అప్ డేట్ ఏమిటంటే… ‘ఆర్ఆర్ఆర్’ కోసం తాము స్టార్ హీరోలమన్న ఇమేజ్‌ని పక్కనబెట్టి ప్రచారం చేశారు తారక్, చరణ్. ఈ చిత్ర సక్సెస్‌కు ప్రచారం కూడా కారణం కాగా, ఇప్పుడు తమిళ హీరో విజయ్ అనుసరిస్తున్న తీరు ఇక్కడి జనానికే కాదు, తమిళ సినీ అభిమానులకు కూడా నచ్చడం లేదు. నిన్న తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి రాకుండా తన డాబుని చూపించుకున్నాడు విజయ్. దీంతో ప్రచారంలో పెద్దగా పస లేకుండా పోయింది. ఇది ఇక్కడి కలెక్షన్లపై ప్రభావం పడనుంది.