Telugu BB Non Stop: బిగ్ బాస్ నాన్ స్టాప్ రంజుగా సాగుతోంది. ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ అదే రేంజ్ లో ఉంది. కొంత మంది కంటెస్టెంట్ల డబుల్ మీనింగ్ డైలాగులు, బూతులతో రసవత్తరంగా సాగుతోంది. ఎలిమినేషన్ వస్తే చాలు ఎవరూ తగ్గకుండా రెచ్చిపోతున్నారు. ఒకరిపైమరొకరి విరుచుపడుతున్నారు. ఈ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి మొత్తం 17 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. ఇందులో కొత్త వాళ్లతో పాటు మాజీ కంటెస్టెంట్లు కూడా ఉన్నారు. వీళ్లలో ఇప్పటివరకు ముమైత్, శ్రీ రాపాక, ఆర్జే చైతూ, సరయు, తేజస్వీ, ముమైత్ ఖాన్ రెండుసార్లు, స్రవంతి చోకారపు, మహేశ్ విట్టాలు బయటకు వెళ్లిపోయారు.

అయితే బిందు మాధవి, అఖిల్ సార్థక్ కూడా టైటిల్ ఫేవరెట్లుగా బరిలోకి దిగిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఇద్దరి మధ్యనే ఎక్కువ పోటీ కనిపిస్తోంది. వీళ్లు తరచూ గొడవలు పడుతుండటం కూడా చూసాం. అఖిల్ బ్యాచ్ అంటే నటరాజ్, అషు, అజయ్ బిందుమాధవిని టార్గెట్ చేయడం తెలిసిందే. దీంతో ఇప్పటికే ఎన్నో ఫైటింగులు కూడా జరిగాయి.

కాగా తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో నాగార్జున బిందు, అఖిల్ ల బాత్రుం ఇష్యూ పై మాట్లాడారు. కన్‌ఫెషన్ రూమ్‌కు పిలిచి మరీ ఇద్దరికి వార్నింగ్ ఇచ్చాడు. ఈవారం నామినేషన్స్ లో వచ్చిన పాయింట్స్ కి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అఖిల్, బిందుమాధవి, శివ ఈ ముగ్గురిని కన్ఫెషన్ రూంకి పలిచి వీరి మధ్య జరిగిన ఇష్యూపై క్లారిటీ ఇచ్చాడు. అలాగే హౌస్ మేట్స్ అందరికీ కూడా క్లారిటీ ఇచ్చాడు.

ఫస్ట్ బిందు బాత్రూమ్ ఇష్యూ గురించి మాట్లాడారు. అసలు అఖిల్ ఏం అన్నాడు. నువ్వు ఏం ఊహించుకుంటున్నావని బిందును అడిగాడు. నువ్వే పక్కకిరా అని అవర్డ్ ఉపయోగించింది నువ్వే.. అది అఖిల్ అన్నాడని ఊహించుకుని శివతో కూడా ఆర్గ్యూ జరిగింది. అయితే అఖిల్ బిందు గురించి ఏదో బూతు మాట్లాడడని బిందు ఊహించుకోవడం శివ కూడా విన్నాడని బిందు నమ్మడం. ఈ విషయంలో హోస్ట్ నాగార్జున ముగ్గురుని కన్పెషన్ రూమ్ కి పిలిచి ఆరాతీశాడు.
ఒక్కొక్కరు వాళ్ల వెర్షన్స్ చెప్పుకున్నారు. ఈ విషయంలో నాగార్జున ముగ్గురికి ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు. వీడియోలు చూపించి అందరికీ క్లారిటీ ఇచ్చేశాడు. వీడియో చూపించి బిందుకు షాకిచ్చాడు. పక్కకు రా… బ్యాక్ బోన్ అంటూ అఖిల్ తనను పక్కకు రా అన్నాడని బిందూ చేసిన ఆరోపణల గురించి తేల్చేశాడు. అజయ్‌తో జరిగిన సంభాషణను కూడా ప్రస్తావించాడు. వీ వారం బిగ్ బాస్ బిందును టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. నెక్ట్స్ నామినేషన్స్ లో కూడా అఖిల్ ఇదే ఇష్యూపై బిందును నామినేట్ చేసే అవకాశం ఉంది. ఇక అఖిల్ కెప్టెన్ కావడంతో బిందుకి ఈ అవకాశం లేదు.
Recommended Videos:


