Pawan Kalyan OG: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన చాలా సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిప్పుకునేలా చేశాయి. ఇలాంటి సందర్భంలోనే ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నాడు. తద్వారా ఆయనకి ఎలాంటి ఐడెంటిటి రాబోతోంది అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పాలిటిక్స్ లో తను బిజీగా ఉంటూనే సినిమాలను కూడా చేస్తూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…ఇక ఈనెల 25వ తేదీన సుజీత్ దర్శకత్వంలో చేసిన ఓజీ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒక దానికి తగ్గట్టుగానే ఈ మూవీని కూడా తీర్చిదిద్దినట్టుగా తెలుస్తోంది…మరి ఈ సినిమాతో తనకు ఎలాంటి ఐడెంటిటి వస్తోంది. పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ని సాధించగలుగుతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది.
ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కన ఉండే క్యారెక్టర్లలో ఒక తెలుగు నటుడు కూడా ఈ సినిమాలో నటించబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని చాలా రహస్యంగా ఉంచారట. ఇంతకీ ఆ నటుడు ఎవరు అంటే జగపతిబాబుగా తెలుస్తోంది. ఆయన పవన్ కళ్యాణ్ వింటే ఉండి అతన్ని చివరికి వెన్నుపోటు పొడుస్తాడు అనే వార్తలైతే వినిపిస్తున్నాయి.
మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియదు కానీ మొత్తానికైతే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ని నమ్మించి మోసం చేసే క్యారెక్టర్ లో జగపతిబాబు కనిపిస్తున్నాడు అనే వార్తలైతే గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళ కాంబినేషన్లో ఇప్పటివరకు సినిమా అయితే రాలేదు.
కాబట్టి ఈ సినిమా చాలా ప్రత్యేకంగా నిలువబోతుందంటూ పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉండటం విశేషం… ఇక ఇప్పటివరకు ఎవరి ఎలాంటి సినిమాలు చేసిన కూడా పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలు నెక్స్ట్ లెవెల్లో నిలుస్తున్నాయి. మరి దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళుతుండటం విశేషం…