https://oktelugu.com/

Amulya Gowda: కార్తీక దీపం సీరియల్ హీరోయిన్ కి లైంగిక వేధింపులు… అతనిపై పోలీసులకు ఫిర్యాదు!

లైంగికంగా వేధిస్తున్నాడు. ఇదంతా ఏంటని నిలదీశాను. దీంతో ఏ పోలీసులకి చెప్పుకుంటావో .. చెప్పుకో పో అంటూ బెదిరించాడని ఆమె వాపోయింది. దీంతో అతనికి బుద్ధి చెప్పాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతనికి బుద్ధి చెప్పి నాకు న్యాయం చేయాలని కోరింది.

Written By:
  • S Reddy
  • , Updated On : May 9, 2024 / 09:08 AM IST

    Amulya Gowda

    Follow us on

    Amulya Gowda: పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు తరచూ వినిపిస్తూనే ఉంటాయి. ఆఫర్ కావాలంటే కమిట్మెంట్ ఇవ్వాలనే దర్శక నిర్మాతలు ఇప్పటికీ ఉన్నారంటే.. అతిశయోక్తి కాదు. ఏదో ఒక సందర్భంలో ప్రతి హీరోయిన్ ఇలాంటి చేదు అనుభవం ఎదుర్కొని ఉంటుంది. సినీ పరిశ్రమ లోనే కాకుండా ఈ కాస్టింగ్ కౌచ్ వేధింపులు సీరియల్ హీరోయిన్స్ కి కూడా తప్పడం లేదు. తాజాగా బుల్లితెర నటి అమూల్య గౌడ ఈ వేధింపులకు గురైనట్లు తెలుస్తుంది.

    దర్శక నిర్మాతలు తోటి నటుల నుంచి ఎక్కువగా ఇలాంటి సంఘటనలు ఎదుర్కొంటున్నారు. అయితే తనకు సూర్య అనే వ్యక్తి అవకాశాలు ఇస్తానని చెప్పి .. తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై అమూల్య గౌడ స్పందిస్తూ .. సూర్య అనే వ్యక్తి నన్ను కాస్టింగ్ డైరెక్టర్ గా పరిచయం చేసుకున్నాడు. నన్ను ఆడిషన్ కి పిలిచాడు. నా నెంబర్ తీసుకుని అసభ్యకరమైన మెసేజ్ లు పంపుతున్నాడు.

    లైంగికంగా వేధిస్తున్నాడు. ఇదంతా ఏంటని నిలదీశాను. దీంతో ఏ పోలీసులకి చెప్పుకుంటావో .. చెప్పుకో పో అంటూ బెదిరించాడని ఆమె వాపోయింది. దీంతో అతనికి బుద్ధి చెప్పాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతనికి బుద్ధి చెప్పి నాకు న్యాయం చేయాలని కోరింది. అప్పట్లో ఈ కాస్టింగ్ కౌచ్ బాగా వినిపించింది. కొందరు సెలెబ్రెటీలు వారికి ఎదురైన చేదు అనుభవాలు బహిరంగానే చెప్పుకొచ్చారు. మీటూ పేరుతో అప్పట్లో పెద్ద ఉద్యమమే జరిగింది.

    ఇక అమూల్య కెరీర్ విషయానికి వస్తే .. కన్నడ నటి అయిన అమూల్య గౌడ కార్తీకదీపం సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఇందులో సౌర్య గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కన్నడ లో బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసి సత్తా చాటింది. టాప్ 5 లో నిలిచింది. ప్రస్తుతం తెలుగులో ఓ సీరియల్ చేస్తుంది. స్టార్ మాలో ప్రసారం అవుతున్న గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో హీరోయిన్ గా నటిస్తుంది.