https://oktelugu.com/

Suma Adda: బాయ్ ఫ్రెండ్ తో డేట్ కి వెళ్లి అది చేసేశాను… సుమ కనకాలతో ఓపెన్ గా చెప్పేసిన స్టార్ యాంకర్!

ఫీజు కడుతున్నాం అని గీత పంచులు వేసింది. ఇక శిల్పా చక్రవర్తి అయితే తన బాయ్ ఫ్రెండ్ గుర్తుకు వస్తున్నాడు అంటూ క్రేజీ కామెంట్ చేసింది. ఒక స్టూడెంట్ పుష్ అప్స్ చేస్తుంటే అతన్ని చూస్తుంటే బాయ్ ఫ్రెండ్ గుర్తొస్తున్నాడు అని చెప్పింది.

Written By:
  • S Reddy
  • , Updated On : May 19, 2024 / 06:23 PM IST

    Suma Adda

    Follow us on

    Suma Adda: సుమ కనకాల హోస్ట్ చేస్తున్న సుమ అడ్డా తాజా ఎపిసోడ్ లో రచ్చ మాములుగా లేదు. యాంకర్స్ స్పెషల్ కావడంతో నలుగురు లేడీ యాంకర్లు గెస్టులుగా విచ్చేశారు. గాయత్రి భార్గవి, శిల్పా చక్రవర్తి, గీత భగత్, వింధ్య సుమ అడ్డాలో సందడి చేశారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో ఆకట్టుకుంటుంది. అందరి పై పంచులు వేసే సుమ పై రివర్స్ పంచులు పేలాయి. యాంకర్ వింధ్య, గీత భగత్ ఎంట్రీ ఇవ్వడంతోనే .. ఇద్దరూ బాంబే యాంకర్లు అయిపోయారే ఈ మధ్య అని సుమ అన్నారు.

    ఇక్కడ మీరు ఏ స్లాట్ వదలడం లేదు కదా .. అందుకే అక్కడికి వెళ్లాల్సి వచ్చింది అంటూ వింధ్య కౌంటర్ ఇచ్చింది. ఆ తర్వాత గీతా భగత్ , సుమ కలిసి చిన్న స్కిట్ చేశారు. సుమ హాస్టల్ వార్డెన్ కాగా,స్టూడెంట్ రోల్ చేసింది గీత. ‘ మీ అమ్మా నాన్న నా మీద నమ్మకంతో హాస్టల్ లో ఇక్కడ పెడితే .. నువ్వేమో అంటూ సుమ అంటే .. మీ మీద నమ్మకంతో ఇక్కడ పెట్టలేదు. శంషాబాద్ లో మా సైట్ అమ్మకంతో పెట్టారు.

    అంత ఫీజు కడుతున్నాం అని గీత పంచులు వేసింది. ఇక శిల్పా చక్రవర్తి అయితే తన బాయ్ ఫ్రెండ్ గుర్తుకు వస్తున్నాడు అంటూ క్రేజీ కామెంట్ చేసింది. ఒక స్టూడెంట్ పుష్ అప్స్ చేస్తుంటే అతన్ని చూస్తుంటే బాయ్ ఫ్రెండ్ గుర్తొస్తున్నాడు అని చెప్పింది. పెళ్ళైతే ఇద్దరు పిల్లలు ఉండేవారు. మళ్లీ బాయ్ ఫ్రెండ్ గుర్తొస్తున్నాడట అని సుమ అంటే .. ప్రేమకు వయసుతో సంబంధం లేదు మేడం అంటూ శిల్పా కవర్ చేసింది.

    పైగా ఒకసారి బాయ్ ఫ్రెండ్ తో తిరగడానికి బయటకు వెళ్ళినపుడు డాన్స్ చేశాం. ఆ తర్వాత .. ‘ ఆ .. హూ అంటూ తెగ మెలికలు తిరిగింది. దీంతో మిగిలిన వాళ్ళు కూడా హా .. హూ అంటూ వంతు పలికారు. దీంతో అంతా నవ్వేశారు. షోలో నలుగురు లేడీ యాంకర్లు ఫుల్ రచ్చ చేశారు. ప్రస్తుతం సుమ అడ్డా లేటెస్ట్ ప్రోమో యూట్యూబ్ లో తెగ వైరల్ అవుతుంది.