https://oktelugu.com/

Sridevi Drama Company: రష్మీ లవర్ సుడిగాలి సుధీర్ కాదు మరొకరు… ఎట్టకేలకు అసలు విషయం వెలుగులోకి!

రష్మీ వయసు 35 ఏళ్లు. ఇంకా పెళ్లి చేసుకోలేదు. రష్మీ పెళ్లిపై రూమర్లు తరచూ వస్తూనే ఉన్నాయి. కానీ అందులో ఒక్కటి నిజం లేదు. రష్మీ మాత్రం పెళ్లి ఆలోచన పక్కన పెట్టేసింది. బుల్లితెర యాంకర్ గా మరింత క్రేజ్ పెంచుకుంటుంది.

Written By:
  • S Reddy
  • , Updated On : April 27, 2024 / 09:43 AM IST

    Sridevi Drama Company

    Follow us on

    Sridevi Drama Company: జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన రష్మీ గౌతమ్ ఇప్పుడు బుల్లితెర టాప్ యాంకర్ గా రాణిస్తుంది. ఈటీవీలో ప్రసారమవుతున్న పలు షోలు, ఈవెంట్లు హోస్ట్ చేస్తూ ఈటీవీకే పరిమితమైంది. రష్మీ ఒరిస్సాకి చెందిన అమ్మాయి. పుట్టి పెరిగిందంతా వైజాగ్ లోనే. చిన్న వయసులోనే ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. జబర్దస్త్ యాంకర్ గా సక్సెస్ అయింది. ప్రస్తుతం రష్మీ కెరీర్ రెండు షోలు, నాలుగు ఈవెంట్లు అన్నట్లుగా బిజీగా మారిపోయింది.

    ఇక రష్మీ వయసు 35 ఏళ్లు. ఇంకా పెళ్లి చేసుకోలేదు. రష్మీ పెళ్లిపై రూమర్లు తరచూ వస్తూనే ఉన్నాయి. కానీ అందులో ఒక్కటి నిజం లేదు. రష్మీ మాత్రం పెళ్లి ఆలోచన పక్కన పెట్టేసింది. బుల్లితెర యాంకర్ గా మరింత క్రేజ్ పెంచుకుంటుంది. అనూహ్యంగా రష్మీ ప్రియుడు స్టేజ్ మీదకు వచ్చాడు. రష్మీ బర్త్ డే సందర్భంగా ఆమెకు ప్రపోజ్ చేయడం విశేషం. పైగా అదిరిపోయే సప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు.

    దీంతో చాలా ఎమోషనల్ అయింది. స్టేజ్ మీద ఏడ్చేసింది. ప్రస్తుతం రష్మీ శ్రీదేవి డ్రామా కంపెనీ చేస్తున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ ప్రోమో తాజాగా రిలీజ్ అయింది. ఈ నెల 27న రష్మీ పుట్టిన రోజు సందర్భంగా శ్రీదేవి డ్రామా కంపెనీలో బర్త్ డే సెలెబ్రేషన్స్ చేశారు. కాగా డాన్సర్ పండు రష్మీకి స్పెషల్ సప్రైజ్ ఇచ్చాడు. ఆమె కోసం ఓ స్పెషల్ పర్ఫామెన్స్ తో బర్త్ డే విషెస్ చెప్పాడు. అంతే కాదు రష్మీకి ప్రపోజ్ చేశాడు.

    తనకు రష్మీ అంటే ఎంతో ఇష్టం అని చెప్పుకొచ్చాడు. పైగా అతడు రష్మీకి ఫ్యాన్ బాయ్ అని చెప్పడం విశేషం. ఇంతేనా నీ ప్రేమ అని అందరూ అడగ్గా .. ఓ అద్భుతమైన గిఫ్ట్ రష్మీకి ఇచ్చాడు. ఆ గిఫ్ట్ చూసి రష్మీ ఎమోషనల్ అయింది. పండు ఓ ఫోటో బహుమతిగా ఇచ్చాడు. అందులో రష్మీకి ప్రాణమైన చుట్కి గౌతమ్ ని చూసి ఒక్కసారిగా రష్మీ ఏడ్చేసింది. చుట్కి గౌతమ్ రష్మీ పెంపుడు కుక్క కాగా, అది ఇటీవల చనిపోయింది. శాశ్వతంగా దూరమైన తన పెట్ డాగ్ ని చూసి రష్మీ కన్నీటిపర్యంతం అయింది.