https://oktelugu.com/

Sarkaar 4 Success Party Promo: వీడి కక్కుర్తి పాడుగాను, వేరే వాళ్ళ లవర్స్ పై సుడిగాలి సుధీర్ కన్ను… కబ్జా చేసేస్తా అంటూ డబుల్ మీనింగ్ వార్నింగ్!

సుడిగాలి సుధీర్ నేతృత్వంలో సర్కార్ సీజన్ 4 కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సుడిగాలి సుధీర్ కి ఉన్న క్రేజ్ కారణంగా సీజన్ సూపర్ హిట్ అయింది. ఇటీవల కాలంలో హైయెస్ట్ వ్యూస్ దక్కించుకున్న షో గా సర్కార్ 4 నిలిచింది. ఈ క్రమంలో సర్కార్ సక్సెస్ పార్టీ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదల అయింది.

Written By:
  • S Reddy
  • , Updated On : July 30, 2024 / 03:42 PM IST

    Sarkaar 4 Success Party Promo

    Follow us on

    Sarkaar 4 Success Party Promo: సుడిగాలి సుధీర్ ప్లే బాయ్ వేషాలు కొనసాగుతున్నాయి. ఇతర కమెడియన్స్ లవర్స్ మీద కూడా కన్నేశాడు. మీకు వద్దంటే చెప్పండి నేను కబ్జా చేసేస్తా అంటూ డబుల్ మీనింగ్స్ మాట్లాడుతున్నాడు. సుడిగాలి సుధీర్ తీరు చూసి వీడి కక్కుర్తి పాడుగాను అని జనాలు వాపోతున్నారు. సర్కార్ సీజన్ 4 ఎపిసోడ్ లో సుడిగాలి సుధీర్ చేసిన పనికి అవాక్కు అయ్యారు.

    సుడిగాలి సుధీర్ సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చాడు. ఈ క్రమంలో పలు షోలు చేస్తూ అలరిస్తున్నాడు. ఈటీవీలో ఫ్యామిలీ స్టార్స్ పేరుతో ఒక షోకి యాంకర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు అటు ఓటీటీలో కూడా సుధీర్ హవా సాగిస్తున్నాడు. ప్రముఖ ఓటీటీ ఎంటర్టైన్మెంట్ ప్లాట్ ఫార్మ్ ఆహాలో సర్కార్ సీజన్ 4 కి యాంకరింగ్ చేస్తున్నాడు. గత మూడు సీజన్లకు ప్రదీప్ మాచిరాజు యాంకర్ గా ఉన్నాడు. వ్యక్తిగత కారణాలతో ప్రదీప్ తప్పుకున్న నేపథ్యంలో.. సర్కార్ 4 కోసం సుడిగాలి సుధీర్ రంగంలోకి దిగాడు.

    సుడిగాలి సుధీర్ నేతృత్వంలో సర్కార్ సీజన్ 4 కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సుడిగాలి సుధీర్ కి ఉన్న క్రేజ్ కారణంగా సీజన్ సూపర్ హిట్ అయింది. ఇటీవల కాలంలో హైయెస్ట్ వ్యూస్ దక్కించుకున్న షో గా సర్కార్ 4 నిలిచింది. ఈ క్రమంలో సర్కార్ సక్సెస్ పార్టీ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదల అయింది. ఇక షో లో ఇమ్మాన్యుయేల్, వర్ష, యాదమ్మరాజు, అమర్ దీప్, శుభ శ్రీ, రోహిణి, ఫైమా, అవినాష్, సిరి, శ్రీహాన్ తదితరులు పాల్గొన్నారు.

    కాగా ఇమ్ము, సుధీర్, వర్ష, యాదమరాజు మధ్య ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసిందుకుంది. ముందుగా సుధీర్ అందరి పై పంచులు వేస్తూ నవ్వులు పూయించాడు. ఆ తర్వాత వర్ష, యాదమరాజు కలిసి డాన్స్ చేశారు. రొమాంటిక్ ఎక్స్ప్రెషన్స్ తో ఫర్ఫామెన్స్ అదరగొట్టేశారు. అది చూస్తూ ఇమ్మాన్యుయేల్ రగిలిపోయాడు. లబో దిబో అంటూ గుండెలు బాదుకున్నాడు. ఇక తట్టుకోలేక ఇన్ డైరెక్ట్ గా వర్ష ని ఉద్దేశిస్తూ కామెంట్స్ చేశాడు. వామ్మో నాకు ఒక ల్యాండ్ ఉంది కానీ అది వేరే వాడి పేరు మీద ఉంది అని కామెంట్స్ చేశాడు.

    యాదమరాజు తో గొడవకు దిగాడు. ఇక ఇద్దరూ రెచ్చిపోయారు. వర్ష కోసం కొట్టుకునేంత పని చేశారు. ఇక మధ్యలో సుధీర్ కల్పించుకుని ఈ విషయం గురించి స్టేజ్ పైన పంచాయతీ పెట్టాడు. ఇమ్ము, యాదమరాజు ఒకరినొకరు తిట్టుకుంటూ వర్ష కోసం కొట్టుకోబోయారు. అయితే ఇదంతా చేస్తున్న సుడిగాలి సుధీర్ ఒక వాళ్ళకి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. మీ ఇద్దరికీ వద్దు అంటే చెప్పిండి నేను కబ్జా చేస్తా, ఆ తర్వాత మీ ఇష్టం అని.. ఝలక్ ఇచ్చాడు.

    దెబ్బకి వాళ్ళ ఫ్యూజులు అవుట్ అయిపోయాయి. ఈ సీన్ ప్రోమోలో హైలెట్ గా నిలిచింది. ప్రోమో చూస్తుంటే ఫుల్ ఎపిసోడ్ లో ఫన్ మాత్రం అన్ లిమిటెడ్ అనిపిస్తుంది. దీనికి మంచి రెస్పాన్స్ వస్తుంది. కాగా ఈ ప్రోమో నెట్టింట వైరల్ అవుతుంది. మరోవైపు సుడిగాలి సుధీర్ గోట్ పేరుతో ఓ మూవీ ప్రకటించాడు. దీనిపై మరొక అప్డేట్ లేదు. గోట్ మూవీ ఆగిపోయిందని ప్రచారం జరుగుతుంది. అందుకే సుడిగాలి సుధీర్ మరలా యాంకరింగ్ పై దృష్టి సారించాడని అంటున్నారు.