https://oktelugu.com/

Bangalore: బెంగళూర్‌లో రేవ్‌పార్టీ.. పట్టుబడ్డ తెలుగు టీవీ నటులు.. కలకలం

రేవ్‌పార్టీ నిర్వహించిన ఫామ్‌హౌస్‌ వద్ద ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఓ ఎమ్మెల్యే స్టిక్కర్‌ ఉన్న కారు ఉండడం ఏపీ అధికార పార్టీని ఉలిక్కిపడేలా చేసింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు ఈ పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. దీంతో బెంగళూరు రేవ్‌పార్టీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : May 20, 2024 / 12:22 PM IST

    Bangalore

    Follow us on

    Bangalore: దేశ ఐటీ రాజధానిగా గుర్తింపు పొందిన బెంగళూర్‌లో ఆదివారం జరిగిన ఓ రేవ్‌పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. ఈ పార్టీలో తెలుగు టీవీ నటులు, మోడళ్లు, వ్యాపారవేత్తలు పట్టుపడ్డారు. ఓ బడా వ్యాపారికి చెందిన ఫామ్‌హౌస్‌లో బర్త్‌డే పార్టీ పేరుతో రేవ్‌ పార్టీ నిర్వహించారు. ఈమేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఫామ్‌హౌస్‌పై దాడిచేసి తెలుగు చిత్ర పరిశ్రమ, టీవీకి చెందిన నటీనటులు, మోడళ్లను పట్టుకున్నారు. దాదాపు వందమందికిపైగా ఈ కార్యక్రమానికి హాజరైనట్లు తెలుస్తోంది.

    ఎమ్మెల్యే స్టిక్కర్‌ కారు..
    రేవ్‌పార్టీ నిర్వహించిన ఫామ్‌హౌస్‌ వద్ద ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఓ ఎమ్మెల్యే స్టిక్కర్‌ ఉన్న కారు ఉండడం ఏపీ అధికార పార్టీని ఉలిక్కిపడేలా చేసింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు ఈ పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. దీంతో బెంగళూరు రేవ్‌పార్టీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది.

    పార్టీలో డ్రగ్స్‌ వాడకం..
    ఇక ఈ రేవ్‌ పార్టీకి వచ్చిన వారు డ్రగ్స్‌ వాడినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. పోలీసులు ఫామ్‌హౌస్‌లో 17 గ్రాముల ఎండీఎంఏ పిల్స్, కొకైన్‌ స్వాధీనం చేసుకున్నారు. ఫామ్‌హౌస్‌ పరిసరాల్లో జాగ్వార్, బెంజ్‌ సహా ఖరీదైన కార్లను జప్తు చేశారు. ఈ రేవ్‌పార్టీపై ఎలక్ట్రానిక్‌ సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు.

    హేమ ఉన్నట్లు కన్నడ మీడియా ప్రచారం..
    ఇక ఈ రేవ్‌ పార్టీలో తెలుగు నటి పాల్గొన్నట్లు కన్నడ మీడియా ప్రసారం చేస్తోంది. ఈ ప్రచారంపై ఆమె స్పందించారు. తాను హైదరాబాద్‌లోనే ఉన్నట్లు ప్రకటించారు. ఇక ఏపీకి చెందిన ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌ కారు స్టిక్కర్‌ దొరకడంతో ఆయన వచ్చారా లేక ఆయన స్టిక్కర్‌ ఉన్న కారులో వేరే ఎవరైనా వచ్చారా అన్న చర్చ కూడా జరుగుతోంది.