Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజన్ 8 మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఇటీవల దీనికి సంబంధించిన అఫీషియల్ టీజర్ కూడా విడుదల చేశారు. బిగ్ బాస్ సీజన్ 8 లోగో చాలా కలర్ ఫుల్ గా కనిపిస్తుంది. అలాగే ఈసారి ఎంటర్టైన్మెంట్ కూడా ఓ రేంజ్ లో ఉండే విధంగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. దానికి అనుగుణంగా కంటెస్టెంట్స్ వేటలో ఉన్నారట. హౌస్ లో ఆడియన్స్ కి కావాల్సినంత కంటెంట్ ఇచ్చే కంటెస్టెంట్స్ ని ఏరికోరి సెలెక్ట్ చేస్తున్నారట. ఈ నేపథ్యంలో పలువురు సెలెబ్రెటీల పేర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి
ఈ క్రమంలో తాజాగా ఓ హీరో పేరు తెరపైకి వచ్చింది. ఆయన మరెవరో కాదు ఒకప్పటి లవర్ బాయ్ అబ్బాస్. ప్రేమదేశం సినిమాతో అబ్బాస్ ఓవర్ నైట్ స్టార్ గా మారాడు. ఆ తర్వాత తెలుగు, తమిళంలో సినిమాలు చేసి వరుస హిట్స్ అందుకున్నాడు. అప్పట్లో అమ్మాయిలకు క్రష్ గా అబ్బాస్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా యూత్ లో ఆయనకు ఫుల్ క్రేజ్ ఉండేది. అబ్బాస్ హెయిర్ స్టైల్ అప్పట్లో ఓ ట్రెండ్ ని సృష్టించింది. చాలా మంది కుర్రాళ్ళు అతని హెయిర్ స్టైల్ ఫాలో అయ్యేవారు.
అయితే ఆ తర్వాత వరుస ప్లాప్స్ వెంటాడటంతో అబ్బాస్ కెరీర్ డల్ అయింది. దీంతో కొంతకాలం తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైపోయాడు. తన కుటుంబంతో కలిసి న్యూజిలాండ్ షిఫ్ట్ అయ్యాడు. అక్కడే జాబ్ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించాడు. అయితే ప్రస్తుతం అబ్బాస్ మోటివేషనల్ స్పీకర్ గా పనిచేస్తున్నారు. అయితే అబ్బాస్ కి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని అతన్ని బిగ్ బాస్ టీం సంప్రదించారని తెలుస్తుంది.
అబ్బాస్ గనుక బిగ్ బాస్ సీజన్ 8 లో అడుగుపెడితే ఈ షో కి ప్లస్ అయ్యే అవకాశం ఉందని నిర్వాహకులు భావిస్తున్నారట. కాగా గత ఏడాది ప్రసారమైన సీజన్ 7 ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. కామన్ మ్యాన్ గా వచ్చిన పల్లవి ప్రశాంత్ టైటిల్ కొట్టడం సంచలనం సృష్టించింది. ఏడవ సీజన్ కి విన్నర్ మెటీరియల్ అనుకున్న అమర్ దీప్ రన్నర్ అప్ గా నిలిచాడు. ఇక శివాజీ మూడవ స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఫినాలే రోజున జరిగిన గొడవలు మినహా సీజన్ 7 సూపర్ హిట్.
ఇప్పుడు సీజన్ 8 ని కూడా అదే విధంగా విజయవంతం చేయాలని మేకర్స్ స్కెచ్ వేశారట. ఈసారి రెండు హౌసులు ఉంటాయని, హౌస్ మేట్స్ ని రెండు టీములుగా చేసి టాస్కులు నిర్వహిస్తారని ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంధి. ఇక ఎప్పటిలానే ఈ ఎనిమిదవ సీజన్ కి కూడా కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చేశారు.
పరువు హత్య కారణంగా భర్తను కోల్పోయిన అమృత ప్రణయ్ బిగ్ బాస్ షోకి వస్తున్నట్లు సమాచారం. సోనియా సింగ్, యాదమ్మ రాజు, మై విలేజ్ షో అనిల్, రీతు చౌదరి, కుమారీ ఆంటీ, బర్రెలక్క, బంచిక్ బబ్లుతో పాటు మరికొందరు బుల్లితెర, సోషల్ మీడియా సెలెబ్స్ పేర్లు వినిపిస్తున్నాయి.