https://oktelugu.com/

Mukku Avinash: జబర్దస్త్ కమెడియన్స్ కి ఇచ్చేది అంతేనా.. అక్కడి రాజకీయాలు బయటపెట్టిన ముక్కు అవినాష్!

ముఖ్యంగా అవినాష్ కామెడీ నవ్వులు పూయించేది. బిగ్ బాస్ షోకి వెళ్లేందుకు అవినాష్ మల్లెమాల సంస్థ అగ్రిమెంట్ బ్రేక్ చేశాడు. అందుకు గాను రూ. 10 లక్షలు చెల్లించి బయటకు వచ్చానని అవినాష్ చెప్పారు.

Written By:
  • S Reddy
  • , Updated On : May 11, 2024 / 10:44 AM IST

    Mukku Avinash

    Follow us on

    Mukku Avinash: ముక్కు అవినాష్ జబర్దస్త్ సీనియర్ కమెడియన్స్ లో ఒకరు. మిమిక్రీ, ఇమిటేషన్స్ అద్భుతంగా చేస్తాడు. తన మార్క్ కామెడీతో బుల్లితెర మీద అలరిస్తున్నాడు. జబర్దస్త్ టీమ్ మెంబర్ గా వచ్చిన అవినాష్ టీమ్ లీడర్ అయ్యాడు. ముక్కు అవినాష్-కెవ్వు కార్తీక్ టీమ్ కి లీడర్స్ ఉండేవారు. ఏళ్ల తరబడి జబర్దస్త్ లో ఉన్నాడు అవినాష్. 2020లో అతడు జబర్దస్త్ నుండి తప్పుకున్నాడు. బిగ్ బాస్ సీజన్ 4లో అవినాష్ కి అవకాశం వచ్చింది. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన అవినాష్ హౌస్లో రాణించాడు.

    ముఖ్యంగా అవినాష్ కామెడీ నవ్వులు పూయించేది. బిగ్ బాస్ షోకి వెళ్లేందుకు అవినాష్ మల్లెమాల సంస్థ అగ్రిమెంట్ బ్రేక్ చేశాడు. అందుకు గాను రూ. 10 లక్షలు చెల్లించి బయటకు వచ్చానని అవినాష్ చెప్పారు. తాజాగా అవినాష్ జబర్దస్త్ కమెడియన్స్ కి ఇచ్చే పారితోషికాలు, అక్కడి రాజకీయాల గురించి కీలక కామెంట్స్ చేశాడు.

    జబర్దస్త్ లో రాజకీయాలు ఉంటాయని అవినాష్ ఒప్పుకున్నాడు. అయితే ఆ రాజకీయాలు నా మీద పని చేసేవి కావు. నేను ముందుగానే పసిగట్టేవాడిని. ఏదైనా ఉంటే ముఖాన చెప్పమని అడిగేవాడిని. నేను కూడా అలానే ఉండేవాడిని, అని అవినాష్ అన్నాడు. అలాగే టీమ్ లీడర్స్, డైరెక్టర్స్ తో కూడా నాకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. అందుకే నేను నెగ్గుకు వచ్చాను అని అవినాష్ అన్నారు.

    జబర్దస్త్ కమెడియన్స్ కి చాలా తక్కువ పారితోషికం ఇస్తారని ముక్కు అవినాష్ పరోక్షంగా చెప్పాడు. తన టీమ్ మెంబర్స్ కి డబ్బులు ఇవ్వగా తనకు, కెవ్వు కార్తీక్ కి వారానికి కేవలం రూ. 7-8 వేలు మిగిలేవట. అయితే జబర్దస్త్ కమెడియన్ అన్న ఫేమ్ వలన ఈవెంట్స్ వచ్చేవి. ఈవెంట్స్ ద్వారా డబ్బులు సంపాదించుకునే వాళ్ళం అని అవినాష్ చెప్పుకొచ్చాడు. ఈటీవీకి శాశ్వతంగా దూరమైన అవినాష్ స్టార్ మా లో యాంకర్ శ్రీముఖితో పాటు సందడి చేస్తున్నాడు.