https://oktelugu.com/

Kirak RP: మంత్రి రోజాకు ఇచ్చిపడేసిన కిరాక్ ఆర్పీ… ఈ రేంజ్ లో ఊహించలేదు బాబోయ్!

ఇప్పటికే జబర్దస్త్ కమెడియన్స్ హైపర్ ఆది, గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్ వంటి కమెడియన్లు పిఠాపురంలో ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అయితే వైసీపీ మంత్రి రోజా ఇటీవల జబర్దస్త్ కమెడియన్స్ ను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. వాళ్లంతా చిన్న ప్రాణాలు మెగా ఫ్యామిలీకి భయపడి ప్రచారం చేస్తున్నారు.

Written By:
  • S Reddy
  • , Updated On : May 10, 2024 / 08:25 AM IST

    Kirak RP

    Follow us on

    Kirak RP: ఏపీలో మరో మూడు రోజుల్లో ఎన్నికలు. ఎలక్షన్స్ సమీపిస్తున్న తరుణంలో అధికార, ప్రతిపక్ష నేతలు హోరాహోరిగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈసారి పవన్ కళ్యాణ్ గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు. రోజుకు రెండు మూడు ప్రచార సభల్లో పాల్గొంటున్నాడు. పవన్ కళ్యాణ్ కి మద్దతుగా సినీ, టీవీ సెలెబ్రెటీలు ప్రచారంలో పాల్గొంటున్నారు.

    ఇప్పటికే జబర్దస్త్ కమెడియన్స్ హైపర్ ఆది, గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్ వంటి కమెడియన్లు పిఠాపురంలో ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అయితే వైసీపీ మంత్రి రోజా ఇటీవల జబర్దస్త్ కమెడియన్స్ ను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. వాళ్లంతా చిన్న ప్రాణాలు మెగా ఫ్యామిలీకి భయపడి ప్రచారం చేస్తున్నారు. అంతకు మించి వాళ్లకు ఎలాంటి అభిమానం లేదనే అర్థంలో మాట్లాడారు. ఈ కామెంట్స్ ను తిప్పికొడుతూ కిరాక్ ఆర్పీ రోజా పై మీడియా ముందు విరుచుకుపడ్డాడు.

    ఆర్పీ మాట్లాడుతూ .. మమ్మల్ని చిన్న ప్రాణులు, చిన్న ఆర్టిస్టులు అని సంబోధించింది. ఈవిడ ఎమన్నా నేషనల్ ఆర్టిస్టా … 20 ఆస్కార్లు గెలిచిందా. సుధీర్, శ్రీను, హైపర్ ఆది ఇతర ఆర్టిస్టులు స్వచ్ఛంగా పవన్ కళ్యాణ్ గారిపై ఇష్టంతో ప్రచారం చేస్తున్నారు. చిన్న చిన్న ఆర్టిసులు అనే చులకన భావన ఏంటి. నీ జీవితంలో ఎప్పుడైనా గెటప్ శ్రీను లాగా యాక్టింగ్ తో మెప్పించావా. సుధీర్ కింద స్థాయి నుంచి వచ్చి .. ఈ రోజు హీరో గా మారాడు.

    హైపర్ ఆది జబర్దస్త్ లో ట్రెండ్ సెట్ చేశాడు. గంటసేపు ఏకధాటిగా కామెడీ చేసి నవ్వించగలడు. హైపర్ ఆదితో నువ్వు పోటీ పడగలవా అంటూ మండిపడ్డాడు. రోజా గురించి ఎప్పుడు గౌరవం లేకుండా మేము మాట్లాడలేదు. కానీ ఆవిడ మమ్మల్ని చులకన చేసి మాట్లాడుతుంది. మాకు గౌరవం ఇస్తే .. మేము కూడా గౌరవంగా మాట్లాడతాం అంటూ కిరాక్ ఆర్పీ రోజా పై ఫైర్ అయ్యాడు.