Jabardasth: జబర్దస్త్ అంటేనే బూతు ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాం.. ఈటీవీ ఇన్నాళ్లు నడపడమే గొప్ప..

వాస్తవానికి ఈటీవీలో రియాల్టీ షోలు నాణ్యత లేకుండా ఉంటున్నాయి. సీరియల్స్ పరిస్థితి కూడా అంతే. ఇవాల్టికి ఈటీవీని ప్రైమ్ టైం న్యూస్ బులిటెన్లు కాస్తో కూస్తో బతికిస్తున్నాయి. చివరికి న్యూస్ చానల్స్ స్థాయికి ఈటీవీ పరిస్థితి దిగజారిపోయే ప్రమాదం కనిపిస్తోంది.

Written By: Anabothula Bhaskar, Updated On : June 1, 2024 3:07 pm

Jabardasth

Follow us on

Jabardasth: హమ్మయ్య.. ఈటీవీ ప్రేక్షకులను కరుణించింది. ఇన్నాళ్లకు జ్ఞానోదయం అయిన తర్వాత తన బూతు ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాం జబర్దస్త్ కు కత్తెర వేసింది. ఇన్ని సంవత్సరాలపాటు చాలామంది తిట్టి పోశారు. సోషల్ మీడియా వేదికగా దునుమాడారు. అయినప్పటికీ ఈటీవీ మారలేదు. ఏదో టీఆర్పీ రేటింగ్స్ కోసం నానా గడ్డీ కరిచింది. అడ్డమైన ప్రయోగాలు చేసింది. కొద్దిరోజుల పాటు అది వర్కౌట్ అయింది గాని.. ఆ తర్వాత ఈటీవీకి కూడా అసలు విషయం అర్థమైంది. జనానికి కూడా మొహం మొత్తడంతో ఏహే పో అంటూ దేకడం మానేశారు. దీంతో ఈటీవీ దిగిరాక తప్పలేదు. జబర్దస్త్ ను కుదించకా తప్పలేదు. రియాల్టీ షోలను ఎవడూ దేకకపోవడంతో కొత్త ప్రోగ్రాం కోసం ఈటీవీ అంజనం వేస్తోంది. అదే సమయంలో గుది బండగా మారిన జబర్దస్త్ ను వదిలించుకుంది.

ఇక ఇటీవల బార్క్ రేటింగ్స్ లో శ్రీదేవి డ్రామా కంపెనీ 3.53, జబర్దస్త్ 2.74, ఎక్స్ ట్రా జబర్దస్త్ 2.67, సుమ అడ్డా, ఆలీతో సరదాగా ఒకటిన్నర, ఢీ 2.3 వంటి రేటింగ్స్ సాధించాయి. బార్క్ నిబంధనల ప్రకారం అసలు ఇవి రేటింగ్సే కావు.. ఈటీవీ లాంటి పెద్ద చానల్లో ఇలాంటి షోలు ప్రచారం అవుతున్నాయి అటే చాలా నామర్థ. వాస్తవానికి ఈటీవీ టాప్ 30 ప్రోగ్రామ్స్ జాబితాలో టాప్ 6 లో ప్రైమ్ టైం న్యూస్ బులిటెన్లే ఉంటున్నాయి. వాటిని పక్కన పెడితే ఈటీవీ గొప్పగా చెప్పుకునే కార్యక్రమాలు ఏవీ ఉండవు. తాజా బార్క్ రేటింగ్స్ ప్రకారం.. స్టార్ మా 757, జీ తెలుగు 523, ఈటీవీ 254 జీఆర్పీలతో కొనసాగుతున్నాయి. అయితే ఇందులో చెప్పుకోవాల్సిందంటే ఈటీవీ పోటీ పడుతోంది స్టార్ మా తో కాదు.. స్టార్ మా మూవీస్ ఛానల్ తో.. ఇక ఈ జాబితాలో జెమిని ఛానల్, జెమిని మూవీస్ కూడా అదే స్థాయి జీఆర్పీ లతో కొట్టుమిట్టాడుతోంది..

వాస్తవానికి ఈటీవీలో రియాల్టీ షోలు నాణ్యత లేకుండా ఉంటున్నాయి. సీరియల్స్ పరిస్థితి కూడా అంతే. ఇవాల్టికి ఈటీవీని ప్రైమ్ టైం న్యూస్ బులిటెన్లు కాస్తో కూస్తో బతికిస్తున్నాయి. చివరికి న్యూస్ చానల్స్ స్థాయికి ఈటీవీ పరిస్థితి దిగజారిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ఈ దశలోనే ఈటీవీ మరోసారి సుడిగాలి సుధీర్ శరణుజొచ్చింది. మళ్లీ రప్పించుకొని ఫ్యామిలీ స్టార్స్ అనే ఒక కొత్త ప్రోగ్రాం మొదలు పెట్టింది. అది కూడా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాం బాపతే. అయితే ఈ షోను సుధీర్ తన స్పాంటేనిటి తో రక్త కట్టిస్తున్నాడు. ఇప్పటికే సర్కార్ పేరుతో ఆహా ఓటీటీ లో దుమ్మురేపుతున్నాడు. ఈటీవీలో మ్యూజిక్, డ్యాన్స్, కామెడీ వంటి విభాగాలలో ఎన్నెన్నో రియాల్టీ షోలు ఉంటాయి. కాకపోతే అందులో క్వాలిటీ లేకపోవడంతో జనాలకు నచ్చడం లేదు. ఢీ లో హైపర్ ఆది విసిగిస్తున్నాడు.. సుమ అడ్డా ప్రోగ్రాం సినిమా ప్రమోషన్ షో లాగా మారిపోయింది. ఆలీతో సరదాగా అనే కార్యక్రమం కొంతలో కొంత నయం లాగే అనిపించినప్పటికీ.. దానికి ఆడియన్స్ రీచ్ అనేది చాలా తక్కువ..

ఈ క్రమంలో ఈటీవీ కి జబర్దస్త్, ఢీ, సుమ అడ్డా వంటివి ఎక్స్ ట్రా ఫింగర్స్ లాగా మారిపోయాయి. అందువల్లే వాటిని వదిలించుకోవడం లేదా కుదించుకోవడం ఈటీవీకి తప్పనిసరయిపోయింది. అందువల్లే జబర్దస్త్ కు కత్తెర వేసింది. ఎక్స్ ట్రా ను కట్ చేసి పడేసింది. అన్నట్టు ఈటీవీ జీఆర్పీ లు పడిపోతున్న నేపథ్యంలో విన్ ఓటీటీ ని ఎవడూ దేకడం లేదు. చివరికి ఈటీవీ తన ప్రోగ్రామ్స్ ను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తోంది. చానల్ కు అది మరింత ప్రతిబంధకంగా మారుతోంది. వాస్తవానికి ఈటీవీ అనేది అతి పెద్ద నెట్వర్క్. కానీ యూట్యూబ్ రెవిన్యూ కోసం అది ఆ స్థాయిలో దిగజారిపోవడం దాని బేల తనాన్ని సూచిస్తోంది.