https://oktelugu.com/

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ 8లో ఎవరూ ఊహించని కంటెస్టెంట్… ఎంట్రీ ఇస్తున్న ఆ సీనియర్ స్టార్ హీరో!

బిగ్ బాస్ తెలుగు 8పై ప్రకటన వచ్చేసింది. హోస్ట్ నాగార్జున సీజన్ 8 లోగో గ్రాండ్ గా లాంచ్ చేశాడు. బిగ్ బాస్ తెలుగు లేటెస్ట్ సీజన్ లోగో కలర్ఫుల్ గా ఉంది. కంటెస్టెంట్స్ ఎంపిక దాదాపు పూర్తి కాగా... ఎవరూ ఊహించని సెలబ్ ఎంట్రీ ఇస్తున్నాడట.

Written By:
  • S Reddy
  • , Updated On : July 24, 2024 / 05:38 PM IST

    Bigg Boss 8 Telugu

    Follow us on

    Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ రియాలిటీ షో అత్యంత ఆదరణ కలిగిన టెలివిజన్ ఈవెంట్. ప్రతి ఏడాది మూడు నెలలు ప్రసారమయ్యే ఈ షో కోసం ఆడియన్స్ ఆతృతగా ఎదురు చూస్తారు. షో ప్రారంభం కావడానికి రెండు నెలల ముందే ఆ మూడ్ లోకి వెళ్ళిపోతారు. ఈసారి వచ్చే కంటెస్టెంట్స్ ఎవరు? షో ఎలా ఉండబోతుంది? హోస్ట్ ఎవరు?… ఇలా పలు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఇక లాంచింగ్ ఎపిసోడ్ రోజు ప్రేక్షకుల ఉత్కంఠకు తెర పడుతుంది. సదరు సీజన్లో కంటెస్ట్ చేసే సెలెబ్స్ ఎవరో తేలిపోతుంది.

    Also Read: ప్రశాంత్ నీల్ ఆ స్టార్ హీరోతో వరుసగా రెండు సినిమాలు చేస్తున్నాడా..?

    గేమ్ మొదలయ్యాక ఆడియన్స్ వర్గాలుగా విడిపోతారు. వారికి నచ్చిన వారిని ఫాలో కావడం స్టార్ట్ చేస్తారు. గేమ్, ప్రవర్తన నచ్చితే సామాన్యులను కూడా అభిమానిస్తారు. గతంలో ఇది రుజువైంది. ఒకప్పుడు బిగ్ బాస్ షోని సామాన్య జనాలు ఇష్టపడేవారు కాదు. ఇదేదో సోది షో అనుకునేవారు. మెల్లగా పల్లె జనాలకు కూడా బిగ్ బాస్ షో ఎక్కింది. వారు అందులోని మజాను ఆస్వాదిస్తున్నారు.

    బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ సక్సెస్ అయ్యింది. భారీ టీఆర్పీ రాబట్టింది. రైతుబిడ్డ ట్యాగ్ తో హౌస్లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాడు. ఇది ఎవరూ ఊహించని పరిణామం. శివాజీ టైటిల్ ఫేవరేట్ గా ప్రారంభం నుండి ప్రచారం అయ్యాడు. అయితే చివరి వారాల్లో శివాజీ గ్రాఫ్ పడిపోయింది. పల్లవి ప్రశాంత్ గ్రాఫ్ పెరిగింది. ఇక అమర్ దీప్ రన్నర్ పొజిషన్ తో సరిపెట్టుకున్నాడు. టైటిల్ గెలిచిన పల్లవి ప్రశాంత్ అల్లర్ల కేసులో అరెస్ట్ కావడం అపశృతి అని చెప్పొచ్చు.

    గత సీజన్ గ్రాండ్ సక్సెస్ కావడంతో బిగ్ బాస్ మేకర్స్ సీజన్ 8 సరికొత్తగా సిద్ధం చేస్తున్నారు. బిగ్ బాస్ తెలుగు 8 లోగో జులై 21న విడుదల చేశారు. లోగోలో అనేక కోడ్స్ చోటు చేసుకున్నాయి. వాటిని క్రాక్ చేస్తే సీజన్ 8 ఎలా ఉంటుందో ఒక అవగాహన వస్తుంది. ఈసారి రెండు హౌస్లు ఉంటాయనే ప్రచారం జరుగుతుంది. విన్నర్ ని డిసైడ్ చేసే పద్దతిగా కూడా విభిన్నంగా ఉంటుందట.

    నెలరోజుల్లోపే బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కానుందని సమాచారం. లోగో తో కూడిన ప్రోమో వదలిన బిగ్ బాస్ మేకర్స్ తేదీ పై స్పష్టత ఇవ్వలేదు. బిగ్ బాస్ హౌస్ నిర్మాణం కూడా పూర్తి అయ్యిందని తెలుస్తుంది. ముఖ్యమైన కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ చివరికి చేరుకుందట. ప్రతిసారి అధికారిక ప్రకటనకు ముందే కొందరు సెలెబ్స్ పేర్లు లీక్ అవుతాయి. ఈసారి లిస్ట్ భారీగానే ఉంది.

    యూట్యూబర్ బంచిక్ బబ్లు, బర్రెలక్క, కుమారీ ఆంటీ, సోనియా సింగ్, అమృత ప్రణయ్, అంబటి రాయుడు, సురేఖావాణి, నటి హేమ, వేణు స్వామి, రీతూ చౌదరి, విష్ణు ప్రియ, కిరాక్ ఆర్పీ, బుల్లెట్ భాస్కర్ కంటెస్టెంట్స్ గా ఎంపికయ్యారని అంటున్నారు. తాజాగా ఓ సెన్సేషనల్ నేమ్ తెరపైకి వచ్చింది. సీనియర్ హీరో వినోద్ కుమార్ బిగ్ బాస్ తెలుగు 8లో కంటెస్ట్ చేస్తున్నాడట. 80లలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వినోద్ కుమార్ కన్నడ, తెలుగు భాషల్లో రాణించారు.

    మామగారు, సీతారత్నం గారి అబ్బాయి, కర్తవ్యం చిత్రాలు ఆయనకు ఇమేజ్ తెచ్చిపెట్టాయి. హీరోగా ఫేడ్ అవుట్ అయ్యాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారారు. ఇటీవల రాజధాని ఫైల్స్ టైటిల్ తో ఒక చిత్రం చేశాడు. వినోద్ కుమార్ కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు. ఈ క్రమంలో బిగ్ బాస్ షోకి వెళ్లడం వలన మేలు జరుగుతుందని భావిస్తున్నాడట. ఆయన పచ్చ జెండా ఊపాడంటూ ప్రచారం జరుగుతుంది.

    Also Read: ‘సరిపోదా శనివారం’ మూవీ ఎస్ జే సూర్య కి ఎంత వరకు హెల్ప్ అవుతుంది…