Hyper Aadi: హైపర్ ఆదికే చుక్కలు చూపిస్తున్న ఢీ కొత్త జడ్జి… ఇన్నాళ్లకు సరైన మొగుడు!

ఇటీవల ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2 మొదలైంది. కొత్తగా హన్సిక జడ్జి బాధ్యతలు తీసుకుంది. శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్ సైతం జడ్జెస్ గా వ్యహరిస్తున్నారు.

Written By: S Reddy, Updated On : June 17, 2024 6:31 pm

Hyper Aadi

Follow us on

Hyper Aadi: బుల్లితెర పై హైపర్ ఆదికి తిరుగు లేదు. జబర్దస్త్ వేదికగా మొదలైన హైపర్ ఆది ప్రస్థానం కొనసాగుతుంది. షోలో హైపర్ ఆది ఉన్నాడంటే ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అన్నట్లు. జబర్దస్త్ షోని అతడు ఒంటి చేత్తో సక్సెస్ చేశాడు. జబర్దస్త్ కి హైపర్ ఆది, ఎక్స్ట్రా జబర్దస్త్ కి సుడిగాలి సుధీర్ టీమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రస్తుతం హైపర్ ఆది జబర్దస్త్ లో లేడు. అయితే ఢీ డాన్స్ రియాలిటీ షో, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో హైపర్ ఆది కొనసాగుతున్నాడు.

ఈ రెండు షోల్లో హైపర్ ఆదిదే డామినేషన్. చివరికి జడ్జెస్ కూడా హైపర్ ఆది పంచులకు భయపడాల్సిందే. ఇక కమెడియన్స్, డాన్సర్స్ అయితే సరేసరి. హైపర్ ఆది నోటి నుండి కౌంటర్లు, కామెడీ పంచులు ప్రవాహంలా వస్తుంటాయి. దాంతో హైపర్ ఆది జోలికి వెళ్లేందుకు ఎవరూ సాహసించరు. అయితే హైపర్ ఆదికి చెక్ పెట్టేందుకు సరైన జడ్జి రంగంలోకి దిగింది. ఆమె దెబ్బకు హైపర్ ఆది కూడా వెనకడుగు వేస్తున్నాడు. ఆమె ఎవరో కాదు హన్సిక మోత్వానీ.

ఇటీవల ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2 మొదలైంది. కొత్తగా హన్సిక జడ్జి బాధ్యతలు తీసుకుంది. శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్ సైతం జడ్జెస్ గా వ్యహరిస్తున్నారు. కాగా హైపర్ ఆది వేసే పంచులకు హన్సిక కౌంటర్లు అదురుతున్నాయి. తాజా ఎపిసోడ్లో ఓ విషయంలో హన్సిక మీరు నచ్చలేదని హైపర్ ఆది అన్నాడు. డోంట్ జడ్జ్ ది జడ్జ్… జడ్జ్ విల్ జడ్జ్ యు… అని బాలయ్య రేంజ్ లో హైపర్ ఆదికి హన్సిక కౌంటర్ ఇచ్చింది. సదరు కౌంటర్ కి ఏం సమాధానం ఇవ్వాలో అర్థం కాక… నోరెళ్ళ బెట్టాడు హైపర్ ఆది.

హైపర్ ఆదినే నోరు మూయించిన హన్సిక గట్స్ కి ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఇన్నాళ్లకు హైపర్ ఆదికి సరైన మొగుడు వచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు. అయితే హన్సిక-హైపర్ ఆది మధ్య ఈ సంభాషణలు కేవలం వినోదం కోసం మాత్రమే. గతంలో పూర్ణ, శ్రద్ధా దాస్, ప్రియమణి ఢీ జడ్జెస్ గా వ్యవహరించారు. కొత్తగా హన్సిక ఎంట్రీ ఇచ్చింది. ఈ స్థాయిలో ఆమె సక్సెస్ అవుతుందో చూడాలి. ఆరంభం మాత్రం అదిరింది.