https://oktelugu.com/

Dhee Celebrity Special: స్టేజి పైన కన్నీళ్లు పెట్టుకున్న శేఖర్ మాస్టర్…మాకు అది తప్ప మరొకటి రాదు అంటూ ఎమోషనల్

ఓ పక్క కొరియోగ్రాఫర్ గా బిజీ గా ఉంటూనే శేఖర్ మాస్టర్ బుల్లితెర మీద ప్రసారం అయ్యే ప్రముఖ రియాలిటీ డాన్స్ షో ఢీ కు జడ్జి గా కూడా వ్యవహరిస్తున్నారు.ఈ క్రమంలోనే తాజాగా ఢీ డాన్స్ షో లో స్టేజి మీద శేఖర్ మాస్టర్ ఎమోషనల్ అయినా వీడియొ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్ అవుతుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : July 7, 2024 / 02:43 PM IST

    Dhee Celebrity Special

    Follow us on

    Dhee Celebrity Special: ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్ డాన్స్ కొరియోగ్రాఫర్లలో శేఖర్ మాస్టర్ కూడా ఒకరు.టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభు దేవా,లారెన్స్ తర్వాత వినిపించే స్టార్ కొరియోగ్రాఫర్ ల పేర్లు శేఖర్ మాస్టర్,జానీ మాస్టర్ అని చెప్పచ్చు.అంచలంచలుగా ఎదుగుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు శేఖర్ మాస్టర్.టాలీవుడ్ లో స్టార్ హీరోలు అయినా చిరంజీవి,అల్లు అర్జున్,మహేష్ బాబు వంటి స్టార్ లతో హుక్ స్టెప్స్ చేయించి మంచి పాపులారిటీని సొంతం చేసుకున్నారు.

    ఓ పక్క కొరియోగ్రాఫర్ గా బిజీ గా ఉంటూనే శేఖర్ మాస్టర్ బుల్లితెర మీద ప్రసారం అయ్యే ప్రముఖ రియాలిటీ డాన్స్ షో ఢీ కు జడ్జి గా కూడా వ్యవహరిస్తున్నారు.ఈ క్రమంలోనే తాజాగా ఢీ డాన్స్ షో లో స్టేజి మీద శేఖర్ మాస్టర్ ఎమోషనల్ అయినా వీడియొ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్ అవుతుంది.ఇటీవలే ఢీ సెలెబ్రెటీ స్పెషల్ 1 డాన్స్ షో ఎంతో విజయవంతంగా పూర్తి అయినా సంగతి తెలిసిందే.ఇక త్వరలోనే ఢీ సెలెబ్రెటీ స్పెషల్ 2 డాన్స్ షో స్టార్ట్ కానుంది.

    ఇక ఈ షో కు శేఖర్ మాస్టర్ తో పాటు మరో డాన్స్ మాస్టర్ గణేష్ మరియు క్రేజీ హీరోయిన్ హన్సిక కూడా జడ్జి గా రానున్నారు.తాజాగా ఢీ సెలెబ్రెటీ స్పెషల్ 2 నుంచి ఒక ప్రోమో ను రిలీజ్ చేసారు నిర్వాహకులు.ఈ ప్రోమో లో హైపర్ ఆది తనదైన శైలిలో స్టేజి మీద నవ్వులు పండించాడు.ఒక్కొక్కరు ఒక్కక్క థీమ్ తో డాన్స్ చేసి అందరిని ఆకట్టుకున్నారు.ఈ క్రమంలోనే ఒక కంటెస్టెంట్ డాన్స్ చేస్తూ ఒక్కసారిగా ఆగిపోయాడు.కారణం ఏంటి అని అడగటంతో పక్కన డాన్సర్ గురించి ఆగిపోయాను అంటూ ఏదో చెప్పుకొచ్చాడు.దాంతో ఒక్కసారిగా ఎమోషనల్ అయినా శేఖర్ మాస్టర్ తనకు డాన్స్ అంటే యెంత ఇష్టమో తన కన్నీళ్ల రూపంలో చెప్పుకొచ్చాడు.

    మేము డాన్సర్స్ కాబట్టి మాకు డాన్స్ తప్ప మరొకటి రాదు.ఇకవేళ డాన్స్ మిస్ అయితే మాస్టర్ వెళ్ళిపోతాడా…మాస్టర్ వెళ్ళిపోతే మాకు ఎక్కడ పని పోతుందా అంటూ కన్నీళ్లు పెట్టుకొని ఎమోషనల్ అయ్యారు శేఖర్ మాస్టర్.ఇక చివరి టాస్క్ లో డాన్సర్స్ అందరు అరిస్తే అంటూ ఎమోషనల్ అయ్యారు.వైరల్ అవుతున్న ఈ వీడియొ ను చుసిన నెటిజన్లు శేఖర్ మాస్టర్ కు తన వృత్తి పై ఉన్న గౌరవానికి ప్రేమకు ప్రశంసలు కురిపిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.