https://oktelugu.com/

Bigg Boss 8 Telugu: కాకరేపుతున్న బిగ్ బాస్ తెలుగు 8 లేటెస్ట్ కంటెస్టెంట్స్ లిస్ట్… ఆ జబర్దస్త్ యాంకర్ కి బంపర్ ఛాన్స్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లాంచింగ్ కి రోజుల సమయం మాత్రమే ఉంది. కంటెస్టెంట్స్ ఎంపిక దాదాపు పూర్తి అయినట్లు సమాచారం. ఈ క్రమంలో కొన్ని క్రేజీ పేర్లు తెరపైకి వస్తున్నాయి. కాగా జబర్దస్త్ మాజీ యాంకర్ హౌస్లో అడుగుపెడుతున్నారు అనేది తాజా న్యూస్. ఆమె ఎవరో చూద్దాం..

Written By:
  • S Reddy
  • , Updated On : August 12, 2024 / 03:42 PM IST

    Bigg Boss 8 Telugu(2)

    Follow us on

    Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ రియాలిటీ షో క్రేజే వేరు. బుల్లితెర ప్రేక్షకులు అమితంగా ఇష్టపడతారు. బిగ్ బాస్ సీజన్ 8 నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు సిద్ధంగా ఉంది. కింగ్ నాగార్జున సీజన్ 8 కి సైతం హోస్ట్ గా కొనసాగుతున్నారు. ఇప్పటికి వరకు విడుదలైన మూడు ప్రోమోలు ఆకట్టుకున్నాయి. సెకండ్ ప్రోమోకి కొనసాగింపుగా వచ్చిన లేటెస్ట్ ప్రోమో మరింత ఆసక్తి పెంచేదిగా ఉంది. ఈసారి అన్నీ లిమిట్లెస్ ఊహించని ట్విస్టులు, సర్ప్రైజ్ లు ఉంటాయని నాగార్జున చెప్పారు.

    దీంతో సీజన్ 8 ఎలా డిజైన్ చేశారనే క్యూరియాసిటీ కొనసాగుతోంది. షో ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని బీబీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. అఫీషియల్ డేట్ ఇంకా రివీల్ చేయలేదు. కానీ విశ్వసనీయ సమాచారం ప్రకారం సెప్టెంబర్ 1 లేదా సెప్టెంబర్ 8న షో స్టార్ట్ చేస్తారని తెలుస్తుంది. అలాగే సీజన్ 8 లో అడుగుపెట్టే కంటెస్టెంట్స్ ఎవరనేది, తెలుసుకోవాలని ఆడియన్స్ తెగ ఆరాటపడుతున్నారు.

    ఈ క్రమంలో ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ఆది రెడ్డి పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారింది. ఆది రెడ్డి చెప్పిన కంటెస్టెంట్స్ లిస్ట్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. ఆది రెడ్డి చెప్పే బిగ్ బాస్ రివ్యూలకు మంచి క్రేజ్ ఉంది. ఆది రెడ్డి రివ్యూలు చాలా జెన్యూన్ గా ఉంటాయి. అందుకే అతన్ని చాలా మంది ఫాలో అవుతుంటారు. కేవలం బిగ్ బాస్ రివ్యూల ద్వారా అతడు యూట్యూబ్ నుండి నెలకు రూ. 30 లక్షల ఇన్కమ్ ఆర్జిస్తున్నారు.

    దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు ఆది రెడ్డి కి ఉన్న డిమాండ్ ఏంటో. ఇక లేటెస్ట్ వీడియోలో ఆది రెడ్డి బిగ్ బాస్ 8 గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియజేశాడు. అలాగే కంటెస్టెంట్స్ లిస్ట్ కూడా చెప్పాడు. యష్మి గౌడ, అంజలి పవన్, సౌమ్య రావ్, యూట్యూబర్ బబ్లు, రీతూ చౌదరి, విష్ణు ప్రియ, నటుడు సెల్వరాజ్, ఆదిత్య ఓం, బెజవాడ బేబక్క, సింగర్ సాకేత్, వేణు స్వామి, తేజస్విని గౌడ, అబ్బాస్, ప్రేరణ, నిఖిల్, ఏక్నాథ్ – హారిక జంట, సౌమ్య జాను. జబర్దస్త్ పవిత్ర, కిర్రాక్ ఆర్పీ… బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టే అవకాశం మెండుగా ఉన్న కంటెస్టెంట్స్ అని ఆదిరెడ్డి తెలియజేశాడు.

    ఇప్పుడు బిగ్ బాస్ మేనేజ్మెంట్, టీం అంతా మారిపోయింది అని ఆది రెడ్డి చెప్పాడు. అలాగే కంటెస్టెంట్ల ఎంపిక, వారి ఫైనల్ ఇంటర్వ్యూలు కూడా కంప్లీట్ అయినట్లు తనకు సమాచారం అందిందని వెల్లడించాడు. కాగా ఆదిరెడ్డి చెప్పిన సెలెబ్స్ లో సౌమ్య రావు పేరు ఆసక్తి కలిగిస్తుంది. అందుకు కారణం ఆమె జబర్దస్త్ మాజీ యాంకర్. అనసూయ జబర్దస్త్ నుండి తప్పుకున్నాక సౌమ్య రావుకు ఛాన్స్ వచ్చింది.

    కన్నడ అమ్మాయి అయిన సౌమ్య రావు జబర్దస్త్ యాంకర్ గా పర్లేదు అనిపించింది. ఆమెకు భాష రాకపోవడం మైనస్ అయ్యింది. గతంలో జబర్దస్త్ కమెడియన్స్ పలువురు బిగ్ బాస్ షోలో పాల్గొన్నారు. ఫస్ట్ టైం మాజీ యాంకర్ అడుగుపెడుతుంది ప్రచారం అవుతుంది.