Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్.. ఎక్కడ చూసినా ఇక దీని గురించే మాట్లాడుకోబోతున్నారు. ఈ షో ప్రసారం అవుతుందంటే చాలు చాలా మంది టీవీలకే అతుక్కొని పోతారు. లేదంటే హాట్ స్టార్ లో ప్రసారం అవుతుంటే అందులో అయినా చూస్తారు. కానీ మొత్తం మీద బిగ్ బాస్ చూడాల్సిందే అంటారు బిగ్ బాస్ అభిమానులు. ఇప్పటికీ 7 సీజన్ లు పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం మరో సీజన్ కోసం రెడీ అయింది. మీరు కూడా బిగ్ బాస్ అభిమానులు అయితే మరి బిగ్ బాస్ 8 అప్డేట్ ఏంటో కూడా తెలుసుకోండి.
బిగ్ బాస్ సీజన్ 8 త్వరలో ప్రారంభం కాబోతుంది. మొదటి సీజన్ కు మంచి టీఆర్పీ వచ్చింది. కానీ అనుకున్న రేంజ్ లో ఆ తర్వాత బిగ్ బాస్ లు రన్ కాలేదు. ఇక 6వ సీజన్ మాత్రం చాలా డల్ గా సాగింది. దీంతో 7వ సీజన్ ను ఉల్టాఫుల్లా అంటూ మార్చేసారు. దీంతో సీజన్ 7 ఆసక్తిగా మారింది. ఇక అనుకున్నట్టుగానే సీజన్ 7 మంచి రిజల్ట్ ను సొంతం చేసుకుంది. సీజన్ 7 ఫినాలే రోజు జరిగిన రచ్చ మాములు రచ్చ కాదు.. అన్నపూర్ణ స్టూడియో బయట సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అంటూ కొంతమంది రచ్చ రచ్చ చేశారు. ఏది ఏమైనా ఈ మొత్తం సీజన్ లు ప్రేక్షకులను అలరించాయి. ఇప్పుడు సీజన్ 8 రెడీ అవుతుంది.
రీసెంట్ గానే ఇందుకు సంబంధించిన ప్రోమో ను కూడా వచ్చింది. ఆగస్టు చివర్లో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ 8 ప్రారంభం కాబోతుంది. ఇదిలా ఉంటే ఈ సారి హౌస్ లోకి ఎవరెవరు వెళ్తున్నారనే ఆత్రుతతో ఉన్నారు నెటిజన్లు. ఇందుకు అనుగుణంగానే సోషల్ మీడియాలో కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో హాట్ బ్యూటీలే ఎక్కువ ఉన్నారట. ఈ సీజన్ లో ఎక్కువ మంది బుల్లితెర సీరియల్స్ నటులు, యాంకర్స్ ఉన్నారని తెలుస్తోంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం ఈ సీజన్ లో.. కిర్రాక్ ఆర్పీ, అమృత ప్రణయ్, నిఖిల్(యాంకర్), కుమారీ ఆంటీ, బర్రెలక్క, అనీల్ గీలా(యూట్యూబర్), బుల్లెట్ భాస్కర్, బమ్ చిక్ బబ్లూ, వంశీ లు పాల్గొనబోతున్నారట.
ఇక షోకు గ్లామర్ ఉండాల్సిందే. అందులో భాగంగా రీతూ చౌదరి, సోనియా సింగ్, కుషితా కల్లపు, సుప్రిత, అంజలి పవన్, వింధ్య విశాక, వర్షిణి , నయన పావనిలను హౌజ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారట. వీరితో పాటు మరో హాట్ బ్యూటీ కూడా ఈసారి హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అయిందట. ఆమనే విష్ణు ప్రియా. గతంలో కూడా బిగ్ బాస్ ఆఫర్ వచ్చినా తిరస్కరించిందట బ్యూటీ. మరి ఈ సారి ఏం చేస్తుందో చూడాలి.
బిగ్ బాస్ 8కు కూడా హోస్ట్ నాగార్జుననే కంటిన్యూ అవుతున్నారు. అయితే ఈ సీజన్ కు కింగ్ ఏకంగా రూ.30కోట్ల రెమ్యూనరేషన్ తీసుకొంటున్నారని తెలుస్తోంది. 7వ సీజన్ కోసం రూ.20కోట్లను అందుకోగా.. ఈ సీజన్ కు ఏకంగా రూ.10కోట్లు అదనంగా అంటే.. రూ.30కోట్లను తీసుకోబోతున్నారట. ఇక బిగ్ బాస్ లోని పలు సీజన్లకు కింగ్ నాగార్జున్ హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ప్రతి సారి తన హోస్టింగ్ తో దుమ్ముదులిపిన అక్కినేని నాగార్జున ఈ సారి ఏం చేయబోతున్నారో చూడాలి.