https://oktelugu.com/

Anasuya Bharadwaj: పెళ్ళై పిల్లల కంటే ఆ పని చేయకూడదా… సంచలనంగా అనసూయ సోషల్ మీడియా పోస్ట్!

అనసూయ ఫెమినిస్ట్. పురుషాధిక్య సమాజాన్ని ఆమె ప్రశ్నిస్తారు. ఆడవారికి అన్యాయం జరిగితే ఊరుకోదు. తాజాగా ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతుంది.

Written By:
  • S Reddy
  • , Updated On : April 28, 2024 / 03:55 PM IST

    Anasuya Bharadwaj

    Follow us on

    Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ తరచుగా ట్రోలింగ్ కి గురవుతుంది. కొందరు కావాలనే టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు చేస్తుంటారు. ముఖ్యంగా అనసూయ డ్రెస్సింగ్ గురించి, పర్సనల్ లైఫ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటారు. పెళ్ళైంది కదా భర్త పిల్లలతో చక్కగా ఉండకుండా ఈ ఎక్సపోజింగ్ ఏంటి .. ఈ వయసులో నీకు అవసరమా అంటూ విమర్శిస్తుంటారు. ఆంటీ అంటూ అనసూయను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంటారు. తన హేటర్స్ కి ఎప్పటికప్పుడు గట్టిగానే బుద్ధి చెప్తుంది అనసూయ.

    అలాగే అనసూయ ఫెమినిస్ట్. పురుషాధిక్య సమాజాన్ని ఆమె ప్రశ్నిస్తారు. ఆడవారికి అన్యాయం జరిగితే ఊరుకోదు. తాజాగా ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతుంది. తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియో షేర్ చేసింది. ఇందులో ఓ 60 ఏళ్ల మహిళ అందాల పోటీల్లో పాల్గొని మిస్ యూనివర్స్ టైటిల్ ని గెలుచుకుంది. ఈ వీడియో ని ఉద్దేశిస్తూ అనసూయ ఓ కామెంట్ చేసింది. ఆమెను విమర్శించే ఎంతోమందికి ఈ వీడియో సమాధానం అని పేర్కొంది.

    బాడీ షేమింగ్ కి పాల్పడేవారిని ఉద్దేశిస్తూ ఈ కామెంట్ చేసింది. ఆడవాళ్ళకి పెళ్లయింది అని, పిల్లలు ఉన్నారని, 30 ఏళ్ళు దాటాయిగా, ఇంట్లో నుంచి బయటకు వెళ్లి ఏం చేస్తారు. ఇంట్లోనే ఉండొచ్చుగా… అంటూ విమర్శించే వారికి ఇది సమాధానం అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఇక అనసూయ పరిశీలిస్తే… ఆమె పుష్ప 2 లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో దాక్షాయణిగా మెప్పించనుంది.

    గత ఏడాది క్షణం తీరిక లేకుండా సినిమాలు చేసింది . విమానం, రంగ మార్తాండ, పెదకాపు 1, ప్రేమ విమానం, మైఖేల్ వంటి చిత్రాల్లో నటించింది. ప్రతి సినిమాలో ఓ వైవిధ్యమైన రోల్ లో కనిపించి ఆకట్టుకుంది. ముఖ్యంగా విమానం మూవీలో వేశ్యగా నటించి ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం అనసూయ చేతిలో రెండు,మూడు తెలుగు సినిమాలు ఉన్నాయి. అలాగే ఓ తమిళ్ మూవీలో ఆమె నటిస్తున్నారు. అనసూయ యాంకరింగ్ కి గుడ్ బై చెప్పేసింది.