Sonu Sood: కోవిడ్ సమయంలో పేదలకు, వలసకార్మికులకు అండగా ఉండి.. వారి పాలిట దైవంగా మారారు బాలీవుడ్ హీరో సోనూసూద్. ఇప్పటికీ సాయం అన్న వారికి లేదనకుండా.. తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నారు. హార్ట్ సర్జరీ, ఆక్సిజన్ ప్లాంటేషన్, ఉద్యోగ కల్పన, పేద విద్యార్థులకు చదువు చెప్పించడం ఇలా ఎన్నో పనులు చేస్తూ.. రియల్ హీరో అనిపించుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనపై ఐటీ దాడులు జరిగాయి. కానీ, ఏ మాత్రం భయపడలేదు సోనూ. తాజాగా, ఈ దాడులపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ స్పందించారు.
తెలంగాణ ఇంపాక్ట్ గ్రూప్ ఆధ్వర్యంలో కొవిడ్ వారియర్స్ సన్మాణ కార్యక్రమం జరిగింది. ఇందులో కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలోనే ప్రసంగణలో భాగంగా సెలబ్రిటీగా సోనూసూద్ చేస్తున్న సేవలను ప్రశంసించారు. సోనూ రాజకీయాల్లోకి వస్తే తమకెక్కడ ఇబ్బండి వస్తుందేమోనని ఆయనపై ఐటీ, ఈడీ దాడులు చేయించడం అవమానకరమని అన్నారు. ఆయన ఇమేజ్ను తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారని.. సోనూసుద్ భయపడనక్కర్లేదని తనకు మేం అండగా ఉంటామని హామీ ఇచ్చారు కేటీఆర్.
సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం ఎంతో సులువని అన్నారు. ప్రస్తుతం కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. మరోవైపు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సోనూసూద్ మాట్లాడుతూ.. కరోనా వల్ల చాలా మంది వారి ఆత్మీయులను కోల్పోయారన్నారు. కేటీఆర్ లాంటి వారు ఉంటే సమాజానికి తనలాంటి అవసరం ఉండదని సోనూసూద్ అన్నారు. కొవిడ్ సమయంలో ఎందరికో అండగా ఉన్న సోనూసూద్ పేరును.. ప్రజలు తమ పిల్లలకు, షాప్స్‌కు పెట్టుకుంటున్నారంటే.. ఆయన చేసిన సాయం ఏ రేంజ్లో ఉందో తెలుసుకోవచ్చు.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Telangana minister ktr praise on sonusood
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com