Telangana Devudu Movie Review: నటీనటులు: శ్రీకాంత్, జిషాన్ ఉస్మాన్ (తొలి పరిచయం), సంగీత, బ్రహ్మానందం, సునీల్, సుమన్, బ్రహ్మాజీ, వెంకట్, పృథ్వీ, రఘుబాబు, తదితరులు
రచన, దర్శకత్వం: వడత్యా హరీష్
మ్యూజిక్: నందన్ బొబ్బిలి
సినిమాటోగ్రాఫర్: అడుసుమిల్లి విజయ్ కుమార్
ఎడిటర్: గౌతంరాజు
నిర్మాత: మొహహ్మద్ జాకీర్ ఉస్మాన్
శ్రీకాంత్ టైటిల్ పాత్రలో జిషాన్ ఉస్మాన్ హీరోగా వడత్య హరీష్ దర్శకత్వంలో మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మాతగా వచ్చిన సినిమా ‘తెలంగాణ దేవుడు’. కాగా ఈ మూవీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్ ను ఏ మేరకు మెప్పించిందో రివ్యూ చూద్దాం.
కథ :
1969 నాటి కాలంలో తెలంగాణలో సామాన్య ప్రజల జీవితాలు దోపిడీ దారుల దౌర్జన్యాల పాదాల కిందా నలిగిపోతూ ఉండేవి. అవన్నీ చూస్తూ పెరిగిన విజయ్ దేవ్ (శ్రీకాంత్) తన చిన్నతనం నుంచే (చిన్ననాటి విజయ్ దేవ్ గా జిషాన్ ఉస్మాన్ నటించాడు) తెలంగాణ రాష్ట్రం పై ప్రత్యేక ప్రేమను పెంచుకుంటాడు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు పడుతున్న కష్టాలను బాధలను అర్ధం చేసుకుంటూ ఉద్యమం గొప్ప తనం గురించి ఓ అవగాహనకు వస్తాడు. ఈ మధ్యలో సుధ(సంగీత)తో విజయ్ దేవ్ కి వివాహం జరుగుతుంది. అలాగే కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఉద్యమ బాట నుంచి రాజకీయ బాట పడతాడు. వేరే ఏ రాజకీయ పార్టీ తెలంగాణకు న్యాయం చేయట్లేదని తానే సొంతంగా బంగారు తెలంగాణ పార్టీ పెట్టి.. తెలంగాణ రాష్ట్రానికి సీఎం అవుతాడు. మరి ఈ మధ్యలో విజయ్ దేవ్ జీవితంలో జరిగిన సంఘటనలు ఏమిటి ? వాటిని విజయ్ దేవ్ ఎలా పరిష్కరించాడు ? అసలు విజయ్ దేవ్ ను కదిలించిన అంశాలు ఏమిటి ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.
విశ్లేషణ :
దశాబ్దాల క్రితం తెలంగాణ ప్రజలు అనుభవించిన కన్నీటి గాధలను ఒంటబట్టించుకుని విప్లవోద్యమ రాజకీయ నాయకుడిగా ఎదిగిన సీఎం కేసీఆర్ జీవితాన్ని వెండితెరపై ఆవిష్కృతం చేయడానికి దర్శకుడు వడత్యా హరీష్ ఓ ప్రయత్నం అయితే చేశాడు. అయితే, 1969 నాటి నేపథ్యం దగ్గరనుంచీ.. ఆయా పాత్రల వేషభాషలను తీర్చిదిద్దడం మరియు రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులను చూపించిన విధానం కొంతమేరకు పర్వాలేదు. ఇక సమసమాజ స్థాపనే ధ్యేయంగా సాగిన తెలంగాణ ఉద్యమ ప్రయాణం ఎలా సాగింది ? ఆ ప్రయాణ రధసారధి ప్రస్థానం తాలూకు సన్నివేశాలు, అలాగే ఆ పాత్రను ఎలివేట్ చేసే సీన్స్ కొంతవరకు ఆకట్టుకున్నాయి.
ఇక ప్రధాన పాత్రలో కనిపించిన శ్రీకాంత్ తన హావభావాలతో బాగానే ఆకట్టుకున్నాడు. ప్లాష్ బ్యాక్ లో వచ్చే ప్రధాన పాత్రలో కనిపించిన జిషాన్ ఉస్మాన్ కూడా బాగానే నటించాడు. అలాగే ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించిన సంగీత, బ్రహ్మానందం, సుమన్ ఆకట్టుకున్నారు. ఇక సునీల్, బ్రహ్మాజీ, వెంకట్, పృథ్వీ, రఘుబాబు, షాయాజి షిండేలు వంటి నటులు అలా కనిపించి వెళ్లారు.
అసలు నిజ జీవితాన్ని రెండు గంటల సినిమా కథగా చెప్పాలి అంటే.. ఆ జీవితంలోని మలుపులను, పరిస్థితులను, ఆ వ్యక్తి తాలూకు మొత్తం ఆలోచనా విధానాన్ని, ఆవేశాన్ని, మరియు ఆశయాన్ని ఇలా సమగ్రంగా అర్ధం చేసుకోవాలి. ఈ విషయంలో దర్శకుడు వడత్యా హరీష్ పూర్తిగా విఫలం అయ్యాడు. మెయిన్ ఎమోషన్స్ ను కూడా తెర మీదకు తీసుకురావడంలో ఫెయిల్ అయ్యాడు.
ప్లస్ పాయింట్స్ :
మెయిన్ పాయింట్,
నటీనటుల నటన,
కీలక ఎమోషన్స్,
మైనస్ పాయింట్స్ :
కథనం,
ఇంట్రెస్టింగ్ సాగని సీన్స్,
రొటీన్ నేరేషన్,
నేపథ్య సంగీతం.
అన్నిటికి మించి ఈ సినిమా దర్శకడు పనితనం.
సినిమా చూడాలా ? వద్దా ?
తెలంగాణ విప్లవోద్యమ రాజకీయ నాయకుడి జీవితాన్ని వెండితెరపై ఆవిష్కృతం చేసే ప్రయత్నం అయితే జరిగింది గానీ, అది వర్కౌట్ కాలేదు. కాకపోతే ఉద్యమం, అన్యాయం పై పోరాటం మరియు ఉద్యమకారుల తాలూకు ఎమోషన్స్ ను కొంతవరకు ఎలివేట్ చేశారు. కానీ, సినిమా ప్లే స్లోగా సాగడం, కథలో క్లారిటీ మిస్ అవ్వడం, కొన్ని చోట్ల పేలవమైన కథనం, టేకింగ్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ సినిమా ఆకట్టుకోదు.
Also Read: కురుప్ సినిమా రివ్యూ