https://oktelugu.com/

Revanth Reddy : రేవంత్ రెడ్డి కి షాక్ ఇవ్వనున్న తెలుగు సినీ పరిశ్రమ..’గద్దర్ అవార్డ్స్’ కి కౌంటర్ గా వినూత్న నిర్ణయం!

తెలంగాణ ఉద్యమ గాయకుడు గద్దర్ గురించి తెలియని వాళ్లంటూ ఎవ్వరూ లేరు. తన పాటలతో జనాల్లో చైతన్యం పెంచుతూ చివరి శ్వాస వరకు అదే విధంగా తన జీవిత ప్రయాణాన్ని సాగించాడు.

Written By:
  • Vicky
  • , Updated On : February 6, 2025 / 05:12 PM IST
    Revanth Reddy

    Revanth Reddy

    Follow us on

    Revanth Reddy : తెలంగాణ ఉద్యమ గాయకుడు గద్దర్ గురించి తెలియని వాళ్లంటూ ఎవ్వరూ లేరు. తన పాటలతో జనాల్లో చైతన్యం పెంచుతూ చివరి శ్వాస వరకు అదే విధంగా తన జీవిత ప్రయాణాన్ని సాగించాడు. మధ్యలో రాజకీయాల్లోకి వద్దామని అనుకున్నప్పటికీ, ఎందుకో మళ్ళీ ఆ ఆలోచనను విరమించుకున్నాడు. కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ఇలా ఎంతోమంది ప్రముఖులతో గద్దర్ కి ఎంతో మంచి సాన్నిహిత్యం ఉంది. అలాంటి గద్దర్ 2023 , ఆగష్టు నెలలో అనారోగ్యంతో కన్ను మూసిన ఘటన యావత్తు సినీ, రాజకీయ ప్రముఖులను శోకసంద్రంలోకి నెట్టేసిన సంగతి తెలిసిందే. ఆయన లేని లోటు ఎవ్వరూ పూడవలేనిదని, తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన తన గాత్రంతో ఒక విప్లవాన్నే నడిపించాడని కొనియాడారు. ఆయన ఎప్పటికీ అలా చిరస్థాయిగా గుర్తుండిపోయేలా తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ‘గద్దర్ అవార్డ్స్’ ని ప్రవేశపెట్టింది. అయితే దీనికి కౌంటర్ గా సినీ ఇండస్ట్రీ త్వరలోనే మన ముందుకు రాబోతుంది.

    గద్దర్ అవార్డ్స్ ప్రకటించినప్పుడు సినీ ఇండస్ట్రీ నుండి ఒక్కరు కూడా స్పందించలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఫిబ్రవరి 6వ తేదీ సినీ ఇండస్ట్రీ పుట్టినరోజు సందర్భంగా ప్రతీ ఏడాది తెలుగు ఫిలిం ఛాంబర్ ఘనంగా ఈవెంట్స్ ని నిర్వహించి సినీ ప్రముఖులకు అవార్డ్స్ ఇవ్వాలి అని నిర్ణయించుకున్నారు. ఆ రోజున నటీనటులు, నిర్మాతలు, దర్శకులు, తమ ఇంటి వద్ద ప్రత్యేకంగా జెండాలు ఆవిష్కరించాలట. థియేటర్స్ కూడా ఇవే అనుసరించాలని ఫిలిం ఛాంబర్ ఆదేశాలు జారీ చేసింది. ఈ జెండా ని రూపకల్పన చేసే బాధ్యతను ప్రముఖ కథా రచయితా పరుచూరి గోపాలకృష్ణకు అప్పగించినట్లు తెలుస్తుంది. అయితే దీనిపై పలువురు తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు కొత్తగా సీఎం రేవంత్ రెడ్డి ‘గద్దర్ అవార్డ్స్’ అనగానే, సినీ ఇండస్ట్రీ ఈ కొత్త ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చిందని, అంటే రేవంత్ రెడ్డి గారి ఆలోచనను పక్కన పెడుతున్నాం అని ఫిలిం ఛాంబర్ ఈ చర్య ద్వారా తెలియచేస్తుందా అంటూ కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు.

    సంధ్య థియేటర్ ఘటన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తెలుగు సినీ పరిశ్రమపై తీసుకున్న కొన్ని కఠినమైన నిర్ణయాలు సినీ పెద్దలకు నచ్చినట్టు లేదు, అందుకే ఇలా వ్యవహరిస్తున్నారు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పరిస్థితులు చూస్తుంటే సీఎం వెర్సస్ తెలుగు సినీ పరిశ్రమ అన్నట్టుగా వ్యవహారం తయారైందని, ఇది ఇండస్ట్రీ కి అసలు మంచిది కాదంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇది కేవలం ఫిలిం ఛాంబర్ సభ్యుల నిర్ణయమా?, లేకపోతే సినీ ఇండస్ట్రీ కి సంబంధించిన పెద్దవాళ్ళు కూడా దీనికి మద్దతు తెలుపుతున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఈమధ్యనే సీఎం ని టాలీవుడ్ టాప్ హీరోలు, దర్శకులు, నిర్మాతలు కలిసి, సినీ ఇండస్ట్రీ ఎదుగుదల పై చర్చలు జరిపారు. కాబట్టి వాళ్లకు ఈ విషయంలో సంబంధం లేదు అనుకోవచ్చు, కానీ ప్రభుత్వం ‘గద్దర్ అవార్డ్స్’ ప్రకటించినప్పుడు ఎందుకు సినీ పెద్దలు మౌనంగా ఉన్నారు అనేది తెలియాల్సి ఉంది.