Game Changer: రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ పాటని తెగ వాడేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..వైరల్ అవుతున్న వీడియో!

గేమ్ చేంజర్ చిత్రం నుండి ఇప్పటి వరకు విడుదలైన రెండు పాటలకు ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మొదటి పాట 'జరగండి..జరగండి' ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఎంటెర్టైమెంట్ షోస్ లో , బయట జరిగే ప్రైవేట్ పార్టీలలో ఈ పాట ఇప్పుడు మారుమోగిపోతుంది. ఈ పాట తర్వాత రీసెంట్ గానే విడుదల చేసిన 'రా మచ్చ మచ్చ' అనే పాటకు కూడా సెన్సేషనల్ రీచ్ వచ్చింది.

Written By: Vicky, Updated On : October 14, 2024 3:32 pm

Game Changer(4)

Follow us on

Game Changer: పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న చిత్రాలలో ఒకటి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం. #RRR వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రామ్ చరణ్ శంకర్ తో చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రం పై అంచనాలు ప్రారంభ స్థాయి నుండే వేరే లెవెల్ లో ఉండేవి. అందుకే డిజిటల్ రైట్స్, సాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్ కనీవినీ ఎరుగని రేట్లకు అమ్ముడుపోయాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కూడా ప్రారంభమైంది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళం భాషలకు కలిపి 300 కోట్ల రూపాయలకు జరుగుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.

ఇదంతా పక్కన పెడితే గేమ్ చేంజర్ చిత్రం నుండి ఇప్పటి వరకు విడుదలైన రెండు పాటలకు ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మొదటి పాట ‘జరగండి..జరగండి’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఎంటెర్టైమెంట్ షోస్ లో , బయట జరిగే ప్రైవేట్ పార్టీలలో ఈ పాట ఇప్పుడు మారుమోగిపోతుంది. ఈ పాట తర్వాత రీసెంట్ గానే విడుదల చేసిన ‘రా మచ్చ మచ్చ’ అనే పాటకు కూడా సెన్సేషనల్ రీచ్ వచ్చింది. ఇంస్టాగ్రామ్ లో ఇప్పటికే ఈ పాట ట్యాగ్ తో 50 వేలకు పైగా రీల్స్ వచ్చాయి. పాట విడుదలైన 12 రోజుల్లో ఈ స్థాయి రెస్పాన్స్ రావడం అనేది చిన్న విషయం కాదు. యూట్యూబ్ లో ఇప్పటి వరకు ఈ పాటకు 35 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అలాగే ఈ పాటని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాడుకోవడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అయ్యింది. రీసెంట్ గా రేవంత్ రెడ్డి దసరా పండుగని తన సొంత ఊరైన కొండారెడ్డిపల్లి లో జరుపుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన అక్కడ మధుర క్షణాలను తల్చుకుంటూ ఒక వీడియో ని చేయించి, దానికి ‘గేమ్ చేంజర్’ చిత్రం లోని ‘రా మచ్చ మచ్చ’ అనే పాటను జత చేసాడు.

ఈ వీడియో ఇప్పుడు సెన్సేషనల్ గా మారింది. తమ పాట బౌండరీలు బ్రేక్ చేసిందని, ఏకంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా వాడుకుంటున్నాడు అంటూ రామ్ చరణ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇలాంటి అద్భుతమైన పాటను అందించినందుకు ఆ చిత్ర సంగీత దర్శకుడు థమన్ కి కృతఙ్ఞతలు తెలియచేస్తూ, పొగడ్తలతో ముంచి ఎత్తుతున్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ వర్క్ నేటి నుండి ప్రారంభం అయ్యిందంటూ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కాసేపటి క్రితమే ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టాడు. అభిమానులు టీజర్ కోసం ఎప్పటి నుండి ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే, దీపావళి కానుకగా ఈ టీజర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.