Chiraneevi: చిరంజీవి సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఈ యంగ్ హీరో…

Chiraneevi: ఇక 2023 వ సంవత్సరంలో చిరంజీవి రెండు సినిమాలను రిలీజ్ చేశాడు. అలాగే 2024 లో కూడా రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.

Written By: Gopi, Updated On : January 19, 2024 2:34 pm
Follow us on

Chiraneevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తూ మంచి దూకుడు మీదున్నాడు. ఇక చిరంజీవి ఇలా ఫాస్ట్ గా సినిమాలు చేయడం వల్ల ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు.

ఇక 2023 వ సంవత్సరంలో చిరంజీవి రెండు సినిమాలను రిలీజ్ చేశాడు. అలాగే 2024 లో కూడా రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలో యంగ్ హీరోలు తనకి పోటీ ఇవ్వలేరు అనేంత రేంజ్ లో చిరంజీవి ముందుకు దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఆయన వశిష్ట డైరెక్షన్ లో చేస్తున్న విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో ఒక 10 నిమిషాల క్యారెక్టర్ కోసం ఒక యంగ్ హీరో కావాల్సి వచ్చింది అంట. ఇక దానికోసం డైరెక్టర్ వశిష్ట చిరంజీవి గారితో ఈ క్యారెక్టర్ కి తేజ సజ్జా అయితే బాగుంటాడని చెప్పడంతో చిరంజీవి తేజ సజ్జా ని పిలిపించి ఆయనకి స్టోరీ చెప్పి అతనితో ఆ సినిమా చేయడానికి ఒప్పించినట్టుగా తెలుస్తుంది. అయితే తేజ సజ్జా రీసెంట్ గా హనుమాన్ సినిమాతో వచ్చి మంచి సక్సెస్ ని అందుకొని ప్రేక్షకుల్లో మంచి ఆదరణని అందుకుంటున్నాడు.

ఇక చిరంజీవి గారి సినిమాలో కూడా 10 నిమిషాల ఎపిసోడ్ లో నటించి తన నట విశ్వరూపాన్ని చూపించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంతకు ముందే తేజ సజ్జా చైల్డ్ ఆర్టిస్ట్ గా చిరంజీవి గారితో చాలా సినిమాల్లో నటించాడు. అయినప్పటికీ పెద్దైన తర్వాత ఇప్పటివరకు ఆయన సినిమాల్లో నటించలేదు.

కాబట్టి ఇప్పుడు తేజ ఈ క్యారెక్టర్ లో నటించడానికి చాలా ఎగ్జైట్ అవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఈయన క్యారెక్టర్ సినిమాలో చిరంజీవి కి హెల్ప్ చేసే క్యారెక్టర్ కావడం, అలాగే ఈ పాత్ర కి మంచి ఇంపార్టెన్స్ కూడా ఉండడంతో తేజ సజ్జా ఈ పాత్ర తను చేయడానికి ఒప్పుకున్నట్టు గా తెలుస్తుంది. ఇక హనుమాన్ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడం తో ఇటు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కి, అటు హీరోగా చేసిన తేజ సజ్జా కి వీళ్ళిద్దరికి మంచి పేరు వచ్చిందనే చెప్పాలి.