Savithri: తీన్మార్ వార్తల ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న సెలబ్రిటీలలో శివజ్యోతి ఒకరు. అసలు పేరు శివజ్యోతి అయినా తీన్మార్ వార్తల ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న శివజ్యోతి ప్రేక్షకుల హృదయాల్లో తీన్మార్ సావిత్రిగా మిగిలిపోయారు. బిగ్ బాస్ షో ద్వారా తీన్మార్ సావిత్రి పాపులారిటీ మరింత పెరగడం గమనార్హం. తాజాగా తీన్మార్ సావిత్రి భర్తతో కలిసి ఇస్మార్ట్ జోడీ2 షోకు హాజరయ్యారు.
ఇస్మార్ట్ జోడీ2 ప్రోమోలో బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే పాటకు శివజ్యోతి, ఆమె భర్త అద్భుతంగా డ్యాన్స్ వేసి మెప్పించారు. ఓంకార్ శివజ్యోతి భర్త గంగూలీతో మా కృష్ణుడు వచ్చాడు అని చెప్పగా బ్యాక్ గ్రౌండ్ లో “ప్రపంచం అంతా పడుకున్న తర్వాత ఆయన లేస్తాడు” అంటూ వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. ఆ వాయిస్ ఓవర్ విని శివజ్యోతి అదే కదా నా బాధ అంటూ కామెంట్లు చేస్తారు. లేచి ఏం చేస్తాడు అని ఓంకార్ అడగగా వీడియోలు చూస్తాడంటూ శివజ్యోతి సమాధానం చెబుతుంది.
ఎవరి వీడియోలు అని ఓంకార్ అడగగా శివజ్యోతి నా వీడియోలు అని చెబుతూ డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పానని అర్థమై నాలుక కరుచుకుంటారు. ఆ తర్వాత జబర్దస్త్ అప్పారావు తన భార్యతో కలిసి డీజే టిల్లు టైటిల్ సాంగ్ కు డ్యాన్స్ చేస్తూ షోలోకి ఎంట్రీ ఇచ్చారు. ఓంకార్ అప్పారావును చూపిస్తూ డీజే టిల్లు అంట అని చెప్పగా అప్పూ టిల్లు అని అప్పారావు వెల్లడించారు. ఈ ప్రోమోకు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి.
శని ఆదివారాలలో రాత్రి 9 గంటలకు ఈ షో ప్రసారం కానుంది. ఓంకార్ తన హోస్టింగ్ తో షోలో అదరగొట్టారు. ప్రోమో ఆసక్తికరంగా ఉండటంతో షోపై అంచనాలు మరింత పెరిగాయి. బుల్లితెరపై ఈ షో మంచి రేటింగ్ ను సొంతం చేసుకుంటోంది.
Recommended Videos: