Teena Shravya: ‘కమిటీ కుర్రాళ్ళు’ హీరోయిన్ టీనా శ్రావ్య(Tina Shravya) రీసెంట్ గానే మేడారం జాతరలో తన పెంపుడు కుక్కను బంగారు తక్కెడ లో కూర్చోబెట్టిన వీడియో ని సోషల్ మీడియా లో షేర్ చేయగా అది బాగా వైరల్ అయ్యింది. ఆమె చేసిన ఈ పనికి తీవ్రమైన విమర్శలు ఎదురయ్యాయి. మన సంప్రదాయాలను ఇంత అవమానిస్తావా అంటూ ఆమెపై గిరిజనులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే మేడారం జాతరలో సమ్మక్క సారక్కలకు తమ చిరాకాల కోరికలు తీర్చుకునేందుకు మొక్కుకుంటారు. ఆ మొక్కు తీరితే భక్తులు బంగారం తో మొక్కులు చెల్లిస్తారు. దశాబ్దాల నుండి ఇది ఆనవాయితీగా కొనసాగుతూ వస్తుంది. అలాంటి చోట టీనా తన పెంపుడు కుక్కని తక్కెడ లో కూర్చోబెట్టడం భక్తులకు కోపం నషాలం కి అంటేలా చేసింది. ఇలా చేస్తూ దేవతలను అవమానించాలని అనుకుంటున్నావా?, ఎంత పొగరు , ఎంత అహంకారం అంటూ ఆమెపై నెటిజెన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
తనపై సోషల్ మీడియా లో వచ్చిన ఈ వ్యతిరేకతను గమనించిన టీనా శ్రావ్య, కాసేపటి క్రితమే క్షమాపణలు చెప్తూ, అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరణ ఇస్తూ ఒక వీడియో చేసి ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసింది. ఆమె మాట్లాడుతూ ‘ఈ వీడియో ద్వారా భక్తులందరికీ క్షమాపణలు చెప్తూ, ఆ విషయం లో క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఇలా చేయడం తప్పు అనే విషయం కూడా నాకు తెలియదు. ఆ వీడే బాగా వైరల్ అయ్యాకనే నాకు ఈ విషయం తెలిసింది. మేము పెంచుకునే కుక్కకు 12 ఏళ్ళు. గత కొంత కాలంగా అది ఒక ట్యూమర్ తో ఇబ్బంది పడుతూ ఉంది. రీసెంట్ గానే ట్యూమర్ సర్జరీ చేయించాము. అది పూర్తిగా రికవరీ అయ్యి, ఎప్పటి లాగా మాతో కలిసి ఉండాలని దేవుడికి మొక్కుకున్నాము. ఆ మొక్కు తీరింది, ఇప్పుడు రికవరీ అయ్యి నడుస్తోంది’.
‘అందుకే మొక్కు చెల్లించాలని మా కుక్కని బంగారం తూకం లో వేయడం జరిగింది. అది కేవలం ప్రేమతో, భక్తితో చేసింది మాత్రమే, వేరే ఉద్దేశ్యం ఏమి లేదు. కానీ అది మేడారం జాతర సంప్రదాయం ప్రకారం, గిరిజనుల ఆచారం ప్రకారం తప్పు అని ఇప్పుడే తెలిసింది. నా వల్ల తప్పు జరిగింది కాబట్టి, నా వల్ల బాధ పడ్డారు కాబట్టి, నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నాను. దయచేసి నన్ను క్షమించండి, మళ్లీ ఇలాంటి పొరపాటు జరగదు. నేను సంప్రదాయాలను గౌరవించే మనిషిని, ఈ విషయాన్నీ ఇక్కడితో ముగించాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది టీనా. మరి ఆమె క్షమాపణలను భక్తులు స్వీకరిస్తారా లేదా అనేది చూడాలి.
మేడారం జాతరలో తన పెంపుడు కుక్కకు తులాభారం (బంగారం) వేసిన ఘటనపై టాలీవుడ్ నటి టీనా శ్రావ్య బహిరంగ క్షమాపణలు చెప్పింది. కుక్క అనారోగ్యం నుంచి కోలుకోవాలని మొక్కుకున్నానని, ఆ భక్తితోనే అలా చేశానని ఆమె వివరించారు. గిరిజన సంప్రదాయాలను కించపరిచే ఉద్దేశ్యం తనకు లేదని, భక్తుల మనోభావాలు… pic.twitter.com/5Yp1P2QHT8
— ChotaNews App (@ChotaNewsApp) January 21, 2026