War 2 TDP MLA: చాలా కాలం నుండి జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) టీడీపీ పార్టీ కి, ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న సంగతి తెలిసిందే. కేవలం దూరంగా ఉండడం మాత్రమే కాదు, ఆ పార్టీ కి ఏ ఎన్నికల్లో కూడా సపోర్టు చేయలేదు. అంతే కాదు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే కనీసం ఆయన్ని చూసేందుకు కూడా జైలుకు రాలేదు. కనీసం సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా సంఘీభావం వ్యక్తం చేస్తాడని అంతా అనుకున్నారు కానీ అది కూడా చేయలేదు. దీంతో టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలు,ఎంపీలు, పార్టీ కార్యకర్తలు ఎన్టీఆర్ పై ఫుల్ ఫైర్ మీద ఉన్నారు. అయితే ఎన్టీఆర్ ని తొక్కేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కుట్రలు చేయలేదు. గత ప్రభుత్వం లో పవన్ కళ్యాణ్ సినిమాలను ఎలా తొక్కేసారో మనమంతా కళ్లారా చూశాము, అలాంటి కక్ష్య సాధింపు చర్యలు లాంటివి కూటమి ప్రభుత్వం చేయలేదు.
Also Read: అలాస్కా లో రహస్య పత్రాలు.. ట్రంప్, పుతిన్ భేటీ లో ఇన్ని భద్రతా లోపాలా?
అందరి సినిమాలకు ఎలా అయితే టికెట్ రేట్స్ హైక్స్, బెనిఫిట్ షోస్ కి అనుమతి ని ఇస్తున్నారో, ఎన్టీఆర్ సినిమాలకు కూడా అదే విధమైన అనుమతులు ఇస్తున్నారు. గత ఏడాది విడుదలైన ‘దేవర’ చిత్రానికి ఇచ్చారు, ఈ ఏడాది విడుదలైన ‘వార్ 2′(War2 Movie) చిత్రానికి కూడా ఇచ్చారు. పైన నుండి ఎన్టీఆర్ కి ఎలాంటి సమస్య లేదు, కానీ లోకల్ గా మాత్రం ఆయనకు తీవ్రమైన సమస్యలను కలిగించేందుకు కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు ప్రయత్నం చేస్తున్నారు అని రీసెంట్ గా అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఫోన్ కాల్ సంభాషణ చూస్తే అర్థం అవుతుంది. ఎన్టీఆర్ ని అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ ఆయన చేసిన కామెంట్స్ పెను దుమారం రేపుతున్నాయి. ఈ ఆడియో రికార్డు విన్న తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ రగిలిపోతున్నారు. ఇలాంటి వాళ్లకు ఎన్నికల్లో ప్రచారం చేసి మరీ గెలిపించాము, ఈరోజు బుద్దొచ్చింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇంతకీ ఆ ఆడియో రికార్డు లో ఏముందో మీరే ఈ క్రింది వీడియో లో వినండి. ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా కూడా లోకల్ ఎమ్మెల్యే నేను అనుమతించట్లేదు, లోకేష్ వాడు అన్ని మాటలు అంటాడా అంటూ పరుష పదజాలం ఉపయోగించి ఇష్టమొచ్చినట్టు తిట్టాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్ గా మారింది. ఎన్టీఆర్ గత 15 ఏళ్ళ నుండి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఏనాడు కూడా ఆయన రాజకీయ నాయకుల మీద కానీ, ప్రస్తుత రాజకీయ విధానాల మీద కానీ ఎలాంటి కామెంట్ చేయలేదు. అలాంటి ఎన్టీఆర్ లోకేష్ ని ఏమి అంటాడు చెప్పండి?, టీడీపీ నాయకులూ కావాలని మనసులో ఎదో పెట్టుకొని ఎన్టీఆర్ ని ఇష్టమొచ్చినట్టు తిడుతున్నారు. ఇది ఏమాత్రం న్యాయం గా లేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఆడియో రికార్డు ని విని మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.
జూనియర్ ఎన్టీఆర్ను లం* కొడుకు అంటూ బూతులు తిట్టిన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్
జూనియర్ ఎన్టీఆర్ సినిమా వార్ 2 సినిమా షోలను అనంతపురంలో ఆపేయాలంటూ వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ pic.twitter.com/D5Y6xstJ7j
— Telugu Scribe (@TeluguScribe) August 17, 2025