https://oktelugu.com/

Allu Arjun: అల్లు అర్జున్ పై టీడీపీ మహిళా ఎంపీ సెటైర్, ఫ్యాన్స్ దెబ్బకు ఏం చేసిందంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై టీడీపీ మహిళా ఎంపీ చేసిన ట్వీట్ సంచలనం రేపింది. ఆమె అల్లు అర్జున్ ని వెటకారం చేసింది. అయితే ఫ్యాన్స్ ఫైర్ కావడంతో సదరు ట్వీట్ డిలీట్ చేసింది. ఇంతకీ ఆ ట్వీట్ లో ఏముందని పరిశీలిస్తే..

Written By:
  • S Reddy
  • , Updated On : December 2, 2024 / 10:54 AM IST

    Allu Arjun(14)

    Follow us on

    Allu Arjun: కూటమి నేతలు హీరో అల్లు అర్జున్ పై గుర్రుగా ఉన్నారు అనేది నిజం. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ పరోక్షంగా వైసీపీకి మద్దతు పలకడమే దీనికి కారణం. జనసేన, బీజేపీ, టీడీపీ గత ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి. వారి ప్రధాన అభ్యర్థి పార్టీగా వైసీపీ ఉంది. జనసేన కూటమిలో చేరిన నేపథ్యంలో మెగా ఫ్యామిలీ, హీరోలు, చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు.. ఆ పార్టీకి మద్దతు పలికారు. ప్రచారం చేశారు. దీనికి భిన్నంగా అల్లు అర్జున్.. తన మిత్రుడు అయిన శిల్పా రవిచంద్ర కిషోర్ ఇంటికి వెళ్లారు.

    వైసీపీ అభ్యర్థిగా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసిన రవికి మద్దతు ప్రకటించాడు. ఇది కూటమి నేతలకు నచ్చలేదు. రవి తనకు మిత్రుడు కావడం వలనే వచ్చాను. అతడికి నంద్యాల పట్ల బాధ్యత ఉంది. గెలిస్తే.. ప్రజలకు మంచి చేస్తాడనే నమ్మకం ఉందని అల్లు అర్జున్ అన్నారు. అనంతరం ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. అల్లు అర్జున్ మిత్రుడు రవి కూడా ఓటమి చెందాడు. ఈ పరిణామం మెగా-అల్లు కుటుంబాల మధ్య కూడా దూరం పెంచిన సంగతి తెలిసిందే..

    కాగా నంద్యాల పార్లమెంట్ స్థానం నుండి టీడీపీ మహిళా నేత శబరి నిల్చున్నారు. ఆమె కూడా విజయం సాధించారు. పుష్ప 2 విడుదల నేపథ్యంలో ఆమె అల్లు అర్జున్ పై సెటైర్ వేశారు. ఈ మేరకు ఆమె చేసిన ట్వీట్ సంచలనం రేపింది. ”అల్ల్లు అర్జున్ గారు.. మీరు నంద్యాలలో చేసిన ఫస్ట్ పొలిటికల్ క్యాంపైన్ మర్చిపోలేనిది. మీరు పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ నంద్యాలలో చేయాల్సింది. మీరు రావడం వలన మాకు మంచి జరుగుతుంది. పుష్ప 2 గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను… అని కామెంట్ చేశారు.

    అల్లు అర్జున్ ని ఆమె పరోక్షంగా ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో ఎంపీ శబరి పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో శబరి ట్వీట్ డిలీట్ చేసినట్లు సమాచారం. అయితే సదరు ట్వీట్ కి సంబంధించిన స్క్రీన్ షాట్స్ విల్ అవుతున్నాయి. టీడీపీ నేత శబరి తన అక్కసు అలా వెళ్లగక్కారు. మరోవైపు పుష్ప 2 డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ విడుదల చేస్తున్నారు. ముందు రోజు అర్ధరాత్రి నుండి తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ షోలు ప్లాన్ చేశారు. టికెట్ ధరలు భారీగా ఉన్నాయి.