Child Actress: మనిషి జీవితం చాలా చిన్నది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవడం కష్టమే. ఇప్పుడే సంతోషంగా, నవ్విన వ్యక్తికి మరో నిమిషంలో ఏం జరుగుతుందో తెలియదు. మారుతున్న జీవన శైలికి అక్కడికి అక్కడే కుప్పకూలి పడుతున్నారు. ఎన్నో రోగాలు, ఎన్నో వ్యాధులు అంటూ మనుషులు చనిపోతున్నారు. ఇక పుట్టిన వారు గిట్టక తప్పదు అనే విషయం తెలిసిందే. అయితే పుట్టిన రోజునే చనిపోవడం అంటే మరింత సాడ్ మూమెంట్ కదా. అయితే ఓ నటి అలాగే చనిపోయింది. ఇంతకీ ఆమె ఎవరు అంటే..
బాలనటి తరుణి సచ్ దేవ్ మీకు గుర్తుందా? ఈమె 15 సంవత్సరాల వయసులోనే ఓ విమాన ప్రమాదంలో చనిపోయింది. అప్పటికే ఈమె 50 ప్రకటనలు చేసింది. ఎన్నో సినిమాల్లో నటించింది. పా అనే సినిమాలో అమితాబ్ స్నేహితురాలిగా నటించి మెప్పించింది. 14 మే 1998న జన్మించిన సచ్ దేవ్ 14 మే 2012న విమన ప్రమాదంలో మరణించింది. ఈ తేదీ14 తో పాటు విచిత్రం కూడా ఉందట. ఆమె మరణించే ముందు తన స్నేహితులతో మాట్లాడింది. ఆ మాటలే అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి.
తల్లితో పాటు విహారయాత్ర కోసం నేపాల్ కు బయలుదేరింది. స్నేహితులకు చెప్పాలని అందరినీ కలుసుకుంది. తరుణి స్నేహితులందరినీ కౌగిలించుకొని మిమ్మల్ని చివరిసారిగా కలుస్తున్నాను అంటూ నవ్వుతూ చెప్పిందట. కానీ అప్పటి వరకు ఆమె ఎప్పుడు కూడా అలా మాట్లాడలేదట. ఫ్లైట్ ఎక్కే ముందు కూడా తమ స్నేహితుడికి మెసేజ్ పంపిందట. అవును నేను ఎక్కే విమానం కూలిపోతే ఏం జరుగుతుంది? అంటూ సరదాగా తన స్నేహితుడికి చివరి సందేశాన్ని పంపిందట. ఐ లవ్ యూ అని రాసిందట.
దురదృష్టవశాత్తూ ఆమెకు అదే చివరి ఫ్లైట్, స్నేహితులను కలవడం చివరి సారి. చాటింగ్ చెప్పినట్టుగానే ఆమె చనిపోయింది. తరుణి తన తల్లి గీత సచ్ దేవ్ తో కలిసి విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా విమాన ప్రమాదానికి గురైంది. దీంతో అక్కడికక్కడే ఇద్దరు ప్రాణాలు వదిలారు. కొన్ని సార్లు ఇలాంటి విషయాలు తెలిస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ అదే ఆమె పుట్టిన రోజు కూడా.