
ఇండస్ట్రీ ఎప్పుడు ఎవరిని స్టార్లను చేస్తుందో ఎవరిని చెప్పడం చాలా కష్టం.కాలం కలిసొస్తే నెలల వ్యవధిలోనే స్టార్ హీరోలైపోవచ్చు. అదే టైమ్ బ్యాడ్ అయితే ఏళ్ల తరబడి కష్టపడినా ఫలితం దక్కదు. అలా అనుకోకుండా ఓ మెరుపు మెరిసి కనుమరుగైపోయిన తారలు ఇండస్ట్రీలో ఎంతోమంది ఉన్నారు. వరుస హిట్లు అందుకుని ప్రేక్షకుల ఆదరాభిమానులు అందుకుని ఒక్కసారి కుదేలైపోయిన అలాంటి హీరోల్లో తరుణ్ ఒకరు. ఆరంభంలో తరుణ పొందిన స్టార్ డమ్ అంతా ఇంతా కాదు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
‘నువ్వే కావాలి’ చిత్రంతో శతదినోత్సవ విజయాన్ని అందుకున్న తరుణ్ ఆ తర్వాత ‘ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను, నువ్వే నువ్వే’ లాంటి బ్లాక్ బస్టర్ విజయాలతో స్టార హీరో అయిపోయారు. కానీ తర్వాత ఎందుకో కానీ ఆయన కెరీర్ కష్టాల్లో పడింది. చేసిన ప్రతి సినిమా ఫ్లాప్ అవుతూనే వచ్చింది. వరుస పెట్టి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఒకటి కాదు రెండు కాదు సుమారు పది పన్నెండేళ్ళు హిట్ల కోసం ట్రై చేసినా ఫలితం దక్కలేదు.
Also Read: మెగా హీరోల దండయాత్ర మొదలుకానుందా?
ఒకానొక దశలో అవకాశాలు లేక కొన్నేళ్ల పాటు ఖాళీగానే ఉన్నారు. చివరగా 2018లో చేసిన ‘ఇది నా లవ్ స్టోరీ’ కూడ బోల్తా కొట్టడంతో ఇక లాభం లేదనుకున్న తరుణ్ ఇక హీరోగా ట్రై చేయడం మానుకుని నిర్మాతగా మారారు. ప్రస్తుతం ఆయన మూడు ప్రాజెక్ట్స్ నిర్మిస్తున్నారు. అందులో రెండు వెబ్ సిరీస్ లు కాగా ఇంకొకటి పూర్తిస్థాయి సినిమా. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి. వెబ్ సిరీస్ పూర్తిగానే సినిమా పనులు మొదలవుతాయట. తరుణ్ మొదలుపెట్టిన ఈ సెకండ్ ఇన్నింగ్స్ ఆయనకు మంచి బ్రేక్ ఇవ్వాలని కోరుకుందాం.