Tanmayi: టెలివిజన్ రంగంలో అత్యంత పాపులారిటిని సంపాదించుకున్న కామెడీ షో ఏదైనా ఉంది అంటే అది జబర్దస్త్ అనే చెప్పాలి. ఈ షో ద్వారా చాలామంది కమెడియన్స్ గా మారి వాళ్లకంటు ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అలాగే సినిమాల్లో కూడా అవకాశాలను అందుకుంటూ వచ్చిన అవకాశాన్ని వాడుకుంటూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…మరి ఇలాంటి సందర్భంలోనే జబర్దస్త్ లో లేడీ ఆర్టిస్టులకు కూడా చాలావరకు మంచి గుర్తింపైతే వస్తుంది. ఇక చాలా మంది నటులు లేడీ గెటప్ లు వేసి ప్రేక్షకులను మెప్పించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ‘తన్మయి’ అనే ట్రాన్స్ జెండర్ సైతం జబర్దస్తీ లో మంచి పాపులారిటిని సంపాదించుకున్నాడు. ఇక 1995వ సంవత్సరంలో హైదరాబాదులోనే పుట్టి పెరిగిన తన్మయి ట్రాన్స్ జెండర్ గా మారిన తర్వాత నుంచి జబర్దస్త్ లో అవకాశాలను అందుకున్నారు. ఇక ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో మంచి పాత్రలను పోషించినప్పటికి ప్రస్తుతానికైతే ఆమెకి అనుకున్నంత గుర్తింపైతే రాలేదు. ఇక ఒకానొక సందర్భంలో సినిమా ఇండస్ట్రీలో మంచి అవకాశాలు వస్తున్నాయి. అనుకున్న సందర్భంలోనే ఇండస్ట్రీకి చెందిన ఒక పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి తనని ఇబ్బంది పెట్టాడని, తను చెప్పింది వినాలని లేకపోతే ఇండస్ట్రీ లో లేకుండా చేస్తానని చెప్పాడట.
అలాగే తన కుటుంబం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇండస్ట్రీకి చెందిన ఆ వ్యక్తి తనని కొట్టాడని తన దగ్గరికి రావాలని కండిషన్లు పెట్టాడని, తను పంపించినప్పుడు మాత్రమే బయటకి వెళ్ళాలని చెప్పాడట. తన్మయి ఏది ఏమైనా కూడా జబర్దస్త్ అనే షో ద్వారా మంచి పాపులారిటిని సంపాదించుకుంది. కాబట్టి తనకి కుటుంబంలో మంచి గౌరవమైతే ఉందని,
తను ట్రాన్స్ జెండర్ గా మారినందుకు వాళ్ల అన్నయ్య కొంతవరకు కోపంగా ఉన్నప్పటికి దాన్ని ఎప్పుడు బయట పెట్టడని చెప్పారు. అలాగే తన కుటుంబానికి ఎలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్తగా చూసుకోవడమే తన లక్ష్యమని చెబుతుండడం విశేషం… మరి ఏది ఏమైనా కూడా సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అనేవి అంత ఈజీగా అయితే రావు…
వాటిని అందిపుచ్చుకోవడానికి చాలా వరకు కసరత్తులైతే చేయాలి. మరి ఇలాంటి సందర్భంలోనే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు వాటన్నింటిని అధిగమించి ముందుకు సాగితేనే ఇక్కడ మంచి ఫ్యూచర్ ఉంటుందని చాలా మంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉండడం విశేషం.