Tandel Movie first review : అక్కినేని ఫ్యామిలీ కి చాలా కాలం నుండి సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేదు. గత ఏడాది సంక్రాంతి కానుకగా అక్కినేని నాగార్జున ‘నా సామి రంగ’ చిత్రం విడుదలై పర్వాలేదు అనే రేంజ్ లో ఆడింది కానీ, అభిమానులను పూర్తి స్థాయిలో సంతృప్తి పరచలేదు. ఈ చిత్రానికి ముందు అక్కినేని ఫ్యామిలీ నుండి విడుదలైన కస్టడీ, థాంక్యూ, ఏజెంట్ వంటి చిత్రాలు ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. ఈ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద కనీసం పది కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను కూడా రాబట్టలేకపోయాయి. దీంతో అక్కినేని అభిమానులు ఒక భారీ హిట్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళ ఆశలన్నీ ‘తండేల్’ చిత్రం పైనే. అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం పై అభిమానుల్లోనే కాదు, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.
అంతటి అంచనాలు ఏర్పడడానికి కారణం ‘బుజ్జి తల్లి’ సాంగ్..దేవిశ్రీ ప్రసాద్ స్వరపర్చిన ఈ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్ లో సుమారుగా ఈ లిరికల్ వీడియో సాంగ్ కి 50 మిల్లియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. కేవలం యూట్యూబ్ లో మాత్రమే కాకుండా ఇతర మ్యూజిక్ ప్లాట్ ఫార్మ్స్ లో కూడా ఈ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. పైగా ఈ చిత్రం లో సాయి పల్లవి హీరోయిన్ కావడంతో క్రేజ్ మరింత పెరిగింది. చందు మొండేటి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాకి అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించాడు. సినిమా ప్రారంభానికి ముందు 70 కోట్ల రూపాయిల బడ్జెట్ అవుతుందని అనుకున్నారు కానీ, మొదటి కాపీ సిద్ధమయ్యేసరికి 90 కోట్ల రూపాయిల వరకు ఖర్చు అయ్యిందని అంటున్నారు. అక్కినేని నాగ చైతన్య రేంజ్ కి ఇది భారీ బడ్జెట్ చిత్రమే. శ్రీకాకుళం సముద్ర ఒడ్డున జరిగే ఈ స్టోరీ, యదార్ధ ఘటనల ఆధారంగా చేసుకొని తెరకెక్కించారు.
రీసెంట్ గానే ఈ సినిమా మొదటి కాపీ ని ప్రివ్యూ షో లాగా ప్రసాద్స్ ల్యాబ్స్ లో మూవీ టీం తో పాటు, సినీ పరిశ్రమకి చెందిన పలువురు ప్రముఖులకు స్పెషల్ స్క్రీనింగ్ వేసి చూపించారట. వాళ్ళ నుండి ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ మొత్తం అందమైన లవ్ స్టోరీ లాగా, హృదయానికి హత్తుకునే డైలాగ్స్, సన్నివేశాలతో చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో సాగిపోతుందట. సెకండ్ హాఫ్ మాత్రం ఈ చిత్రానికి గుండె అని చెప్పొచ్చు. ప్రతీ సన్నివేశాన్ని ఒక అందమైన పెయింటింగ్ లాగా తెరకెక్కించాడట డైరెక్టర్ చందు మొండేటి. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశం ఆడియన్స్ గుండెల్ని పిండేస్తుందట. నాగ చైతన్య, సాయి పల్లవి నటనలకు ఎన్ని అవార్డ్స్ వచ్చినా తక్కువే అన్నట్టుగా అనిపిస్తుందట. ఫిబ్రవరి 7 న విడుదల అవ్వబోతున్న ఈ సినిమా ఆడియన్స్ నుండి కూడా అదే రేంజ్ రెస్పాన్స్ ని దక్కించుకుంటే కలెక్షన్లు సునామీ లాగా వస్తాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.