Thandel Collections : అక్కినేని అభిమానులు ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్న విజయం తండేల్(Thandel Movie) రూపం లో వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. విడుదలకు ముందే పాటలతో సెన్సేషన్ సృష్టించి భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న ఈ చిత్రం, విడుదల తర్వాత మొదటి ఆట నుండే యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ, బాక్స్ ఆఫీస్ వద్ద ఓపెనింగ్ వసూళ్లు అక్కినేని అభిమానులు కనీవినీ ఎరుగని రేంజ్ లో వచ్చాయి. మొదటి రోజు(First Day Collections) డబుల్ డిజిట్ షేర్ వసూళ్లు చూసి అక్కినేని అభిమానులు చాలా కాలం అయ్యింది. గత మూడేళ్ళ నుండి ఈ హీరోల సినిమాలకు డబుల్ డిజిట్ ఓపెనింగ్స్ దేవుడెరుగు, కనీసం డబుల్ డిజిట్ క్లోజింగ్ కూడా రాలేదు. ఒక సినిమా కాకపోతే మరో సినిమాతో సూపర్ హిట్ అందుకునే నాగ చైతన్య(Akkineni Naga Chaitanya) కూడా వరుసగా రెండు డిజాస్టర్లు ఇచ్చాడు. అలాంటి సమయంలో విడుదలైన ‘తండేల్’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రాబడుతున్న వసూళ్లను చూసి ట్రేడ్ పండితులు కూడా ఆశ్చర్యపోతున్నారు.
విడుదలై మూడు రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాము. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మూడవ రోజు కేవలం తెలుగు రాష్ట్రాల నుండే 8 కోట్ల 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిందట. ముఖ్యంగా నైజాం ప్రాంతం లో ఈ చిత్రం సునామీని సృష్టిస్తుంది అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. మూడు రోజుల్లో ఈ ప్రాంతంలో ఇక్కడ 10 కోట్ల 45 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇది నాగ చైతన్య కెరీర్ లోనే ది బెస్ట్ ఓపెనింగ్ అనొచ్చు. అదే విధంగా సీడెడ్ లో 3 కోట్ల 35 లక్షలు, ఉత్తరాంధ్ర లో 3 కోట్ల 31 లక్షలు, ఈస్ట్ గోదావరి లో కోటి 90 లక్షలు, వెస్ట్ గోదావరి లో కోటి 42 లక్షలు, గుంటూరు జిల్లాలో కోటి 56 లక్షలు, కృష్ణ జిల్లా లో కోటి 48 లక్షలు, నెల్లూరు జిల్లాలో 90 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఈ రేంజ్ వసూళ్లను రాబడుతున్న ఈ సినిమా ఓవర్సీస్ ప్రాంతాల్లో మాత్రం ఆ రేంజ్ లో రాబట్టలేకపోతున్నాయి. అక్కడి పరిస్థితులు చూస్తుంటే కచ్చితంగా ఈ చిత్రం ఫ్లాప్ ఆ ప్రాంతంలో ఫ్లాప్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈపాటికి 1 మిలియన్ డాలర్ మార్కుని దాటాల్సి ఈ సినిమా, ఇంకా ఆరు లక్షల డాలర్ల వద్దనే ఆగిపోయింది. ఇండియా కరెన్సీ లెక్కల ప్రకారం ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా ఆరు కోట్ల రూపాయలకు జరగగా, మూడు రోజుల్లో మూడు కోట్ల 70 లక్షల రూపాయిలు మాత్రమే రాబట్టింది. ఫుల్ రన్ లో ఈ ప్రాంతంలో కోటి రూపాయలకు పైగా నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకి 31 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 54 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.