https://oktelugu.com/

Tandel : ‘తండేల్’ 15 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..ఇంత దారుణంగా కలెక్షన్స్ పడిపోతాయని ఊహించలేదు!

Tandel : అక్కినేని(Akkineni Nagachaitanya) అభిమానులు చాలా కాలం తర్వాత ఒక సినిమా సక్సెస్ కి ఎమోషనల్ అవ్వడం 'తండేల్'(Thandel Movie) చిత్రం ద్వారా జరిగింది.

Written By: , Updated On : February 22, 2025 / 05:26 PM IST
Tandel

Tandel

Follow us on

Tandel : అక్కినేని(Akkineni Nagachaitanya) అభిమానులు చాలా కాలం తర్వాత ఒక సినిమా సక్సెస్ కి ఎమోషనల్ అవ్వడం ‘తండేల్'(Thandel Movie) చిత్రం ద్వారా జరిగింది. అల్లు అరవింద్(Allu Aravind), బన్నీ వాసు(Bunny Vasu) నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమాకి మొదట్లో యావరేజ్ టాక్ వచ్చింది. కానీ మొదటి వీకెండ్ మాత్రం కళ్ళు చెదిరే వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఆ మూడు రోజులు వచ్చిన థియేట్రికల్ షేర్స్ ని చూసి కచ్చితంగా ఈ చిత్రం 70 కోట్ల రూపాయలకు పైగా షేర్, 130 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు రాబడుతుందని అందరూ అనుకున్నారు. కానీ అది జరిగే పరిస్థితులు అసలు కనిపించడం లేదు. వీకెండ్ తర్వాత ఈ సినిమాకి సాధారణ వర్కింగ్ డేస్ లో యావరేజ్ రేంజ్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఇక రెండవ వారం లో అయితే దారుణంగా వసూళ్లు పడిపోయాయి. రెండు వారాలు పూర్తి చేసుకొని 16 వ రోజులోకి అడుగుపెట్టిన ఈ సినిమా, ఇప్పటి వరకు ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాము.

ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 15 వ రోజున 30 లక్షల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. ఇది డీసెంట్ రేంజ్ అయినప్పటికీ టార్గెట్ కి కావాల్సిన వసూళ్లు మాత్రం కావు. మొత్తం మీద 15 రోజులకు ఈ చిత్రానికి 90 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 51 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. మూవీ టీం 100 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని పెద్ద ఎత్తున ప్రచారం చేసింది కానీ, పది కోట్ల రూపాయిల దూరం లో ఆగిపోయేట్టుగా అనిపిస్తుంది. జనాల దృష్టిలో ఈ చిత్రం 100 కోట్ల రూపాయిల గ్రాస్ రాబట్టిన సినిమాగా పేరు తెచ్చుకుంది కానీ, మార్కెట్ దృష్టిలో మాత్రం కాదు. కానీ మహాశివరాత్రి సెలవు దినం కాబట్టి ఆరోజున అత్యధిక వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇక ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను ఒక్కసారి పరిశీలిస్తే నైజాం ప్రాంతం లో 19 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం అక్కినేని ఫ్యామిలీ లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా చరిత్రకి ఎక్కింది. కానీ 20 కోట్ల రూపాయిలను అందుకొని ఉండుంటే బాగుండేది. ఈ వీకెండ్ తో ఆ మార్కుని అందుకునే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా సీడెడ్ లో 6 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకి, ఉత్తరాంధ్ర లో 6 కోట్ల 50 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 3 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 2 కోట్లు, గుంటూరు జిల్లాలో 2 కోట్ల 30 లక్షలు, కృష్ణ జిల్లాలో 2 కోట్ల 20 లక్షలు, నెల్లూరు జిల్లాలో కోటి 40 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో 43 కోట్ల రూపాయలకు దగ్గరగా షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, వరల్డ్ వైడ్ గా 51 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది.