Tammareddy Bharadwaj: నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ హైదరాబాద్ లోని ఫిల్మ్‌ఛాంబర్ లో ప్రెస్ మీట్ పెట్టి మరి సినీ పరిశ్రమపై ఏపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా సమాధానాలు ఇచ్చారు. అనంతరం భరద్వాజ ఆన్‌లైన్ టికెటింగ్ గురించి కూడా మాట్లాడుతూ.. ‘ఈ ఆన్‌లైన్ టికెటింగ్ తీసుకొస్తే, ఏ రోజు లెక్కలు ఆరోజు తెలుస్తాయి. అలా తెలిసినప్పుడు.. నిర్మాతలకు భరోసా ఉంటుంది. అందుకే, అలా కావాలని మేం కోరాం. కచ్చితంగా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది.
ప్రభుత్వాలు ఆన్‌లైన్ టికెటింగ్ చేస్తే చిత్ర పరిశ్రమకు చాలా లాభం చేకూరుతుంది. ఆ దిశగా రెండు తెలుగు ప్రభుత్వాలు ఆలోచిస్తాయని నమ్ముతున్నాం. ఇక పరిశ్రమలో గత కొన్ని రోజులుగా సినీ పెద్ద ఎవరు అనే చర్చ జరుగుతోంది. అయితే, ఈ క్రమంలో మీడియా కొంత పరిధి దాటింది. ఎలా పడితే అలా హెడ్డింగ్స్ పెట్టి చులకనగా ఆర్టికల్స్ రాస్తున్నారు. గుర్తు పెట్టుకోండి, సాటి మనిషిని గౌరవించటం చాలా ముఖ్యం.
Also Read: కోట్లు పెట్టి పైసా పైసా ఏరుకుంటున్నాం.. జగన్ కి అర్ధమవుతుందా ?
ఇక పరిశ్రమ పెద్దగా దాసరి నారాయణరావు గారి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. అయితే, చిరంజీవిగారు చొరవ తీసుకుంటున్నారు. ఆయన ఇప్పటికే కొన్ని మంచి పనులు కూడా చేస్తున్నారు. కాకపోతే, ఆయన పరిమితంగా ఉంటున్నారు. సమస్యల పరిష్కారం కోసం దాసరి నారాయణరావులా సమయం వెచ్చించి పనిచేసే వ్యక్తి ఇప్పుడు ఇండస్ట్రీలో లేరు.
అలాంటి వ్యక్తి మాత్రమే పెద్దగా అర్హులు. చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబులాంటి అగ్ర నటులతో పాటు, కొందరు దర్శకులు కూడా తమ పరిధి మేరకు చిత్ర పరిశ్రమకు ఏదో ఒకటి తమ వంతుగా సేవ చేస్తున్నారన్నది నిజం’ అంటూ తమ్మారెడ్డి భరద్వాజ చెప్పుకొచ్చారు.
Also Read: చిరుతో రవితేజ.. టికెట్ రేట్లు పై ఏపీ మంత్రులతో మాట్లాడతాడట