Tamils : ఒకప్పుడు తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రేక్షకుల్లో విపరీతమైన అటెన్షన్ అయితే క్రియేట్ అయ్యేది. ఇక అందులో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది తద్వారా సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను సాధిస్తాయి అని ప్రతి ఒక్కరు నమ్మేవారు. కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ మ్యాజిక్ ఏమీ పని చేయడం లేదు తమిళ్ తో పాటు తెలుగు ప్రేక్షకులను సైతం వాళ్ళ సినిమాలు మెప్పించకపోవడం విశేషం…ఒకప్పుడు తెలుగు సినిమాలతో పోటీ పడి మరి తెలుగులో మంచి విజయాలను సాధించిన తమిళ్ సినిమాలు ఇప్పుడు మాత్రం తమదైన రీతిలో సత్తా చాటడంలో వెనుకబడి పోతున్నాయి. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమాల హవా ఎక్కువగా కొనసాగుతుంది. అలాగే పాన్ ఇండియాలో వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటి కూడా క్రియేట్ చేసుకున్న మన స్టార్ హీరోలు ఇండియాలో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకునే దిశగా ముందుకు సాగుతుంటే తమిళ్ సినిమా ఇండస్ట్రీ మాత్రం డీలా పడిపోయింది. అసలు పాన్ ఇండియాలో ఒక సక్సెస్ ని కూడా సాధించలేకపోతున్నారు అంటే వాళ్లు ఏ రేంజ్ లో తమ సినిమాలను తెరకెక్కిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు… ఒకప్పుడు మణిరత్నం(Mani Rathnam), శంకర్ (Shankar) లాంటి దర్శకుడు వరుస సక్సెస్ లను సాధిస్తూ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తమిళ్ సినిమా ఇండస్ట్రీకి ఒక సపరేట్ క్రేజ్ ను అయితే తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు వాళ్ళ మ్యాజిక్ కూడా పనిచేయడం లేదు. అదే గత కొన్ని రోజుల నుంచి అజిత్ లాంటి హీరో వరుస సినిమాలు చేస్తున్నప్పటికి అవి ఏవి ప్రేక్షకులను అలరించడం లేదు. ఇక రీసెంట్ గా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Good Bad Ugly) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అది అజిత్ (Ajeeth) ఫ్యాన్స్ ని మాత్రమే అట్రాక్ట్ చేసిన సినిమాగా మిగిలిపోయింది.
Also Read : నేను బాక్సింగ్ కి సంబందించిన సినిమా తీస్తే ఆయనే నా హీరో : హరీష్ శంకర్…
అంతేతప్ప సక్సెస్ ను మాత్రం సాధించలేదు. ఇక విజయ్ గురించి మనం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఈయన చేసిన వరుస సినిమాలు ప్లాప్ లను మూట గట్టుకోవడమే కాకుండా తెలుగులో కనీస వసూళ్లను కూడా సాధించలేకపోతున్నాయి అంటే ఆయన సినిమాలు ఎంత నాసిరకంగా ఉంటున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు.
బీస్ట్,వారసుడు,లియో, గోట్ లాంటి సినిమాలతో వరుసగా డిజస్టర్లను మూట గట్టుకున్నాడు. ఈయన చేయబోతున్న సినిమాతో సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక సూర్య రీసెంట్ గా చేసిన రెట్రో సినిమా కూడా డిజాస్టర్ టాక్ ను తెచ్చుకుంది.
ఇంకా ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సూర్య ఎందుకు ఇలాంటి సినిమా చేశాడు అంటూ అతని మీద కొన్ని విమర్శలైతే చేస్తున్నాడు… ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికైనా తమ తీరును మార్చుకొని ఎక్కడ లోపం జరుగుతుందో దానిని గుర్తించి మంచి సినిమాలు చేస్తే బాగుంటుంది. లేకపోతే మాత్రం తమిళ్ సినిమా ఇండస్ట్రీ భారీగా నష్టపోయే అవకాశం అయితే ఉంది.
Also Read : తెలుగు హీరోలను పక్కన పెట్టేస్తున్న స్టార్ డైరెక్టర్ వెంకీ అట్లూరి! కారణం అదేనా?